Mahabubabad | అసభ్యంగా ప్రవర్తించిన అటెండర్.. చెప్పుతో చితక్కొట్టిన మహిళ
Mahabubabad | న్యాయం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల అటెండర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అటెండర్ వేధింపులు తాళలేక.. అతన్ని బాధిత మహిళ చెప్పుతో చితక్కొట్టింది.
Mahabubabad | త్రినేత్ర.న్యూస్ : న్యాయం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల అటెండర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అటెండర్ వేధింపులు తాళలేక.. అతన్ని బాధిత మహిళ చెప్పుతో చితక్కొట్టింది. ఈ ఘటన మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో వెలుగు చూసింది.
జిల్లా పరిధిలోని పర్వతగిరికి చెందిన యాకమ్మ భూమి గ్రీన్ ఫీల్డ్ హైవేలో కోల్పోయింది. దీంతో తనకు రావాల్సిన డబ్బులు వేరే వ్యక్తి ఖాతాలో జమ అయ్యాయి. తన డబ్బులు తనకు వచ్చేలా చూడాలని గత కొద్ది కాలం నుంచి యాకమ్మ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతోంది.
ఈ క్రమంలో కలెక్టరేట్ రెవెన్యూ విభాగంలో పని చేసే అటెండర్ మురళీ.. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత కొద్దిరోజుల నుంచి వేధింపులు ఎక్కువ అవడంతో.. తన సోదరులకు బాధితురాలు చెప్పింది. దీంతో సోమవారం కలెక్టరేట్ చేరుకున్న యాకమ్మ.. అటెండర్ మురళీపై చెప్పుతో దాడి చేసింది.
అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్‌తో పాటు రూరల్ పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అటెండర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అటెండర్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి సోదరులు డిమాండ్ చేశారు.
కలెక్టర్ కార్యాలయంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన అటెండర్.. చెప్పుతో బుద్దిచెప్పిన మహిళ
మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన యాకమ్మ అనే మహిళతో సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అసభ్యంగా ప్రవర్తించిన రెవెన్యూ విభాగంలో పని చేసే అటెండర్ మురళి
దీంతో ఆగ్రహించి ఉద్యోగి పై చెప్పుతో… pic.twitter.com/i2oEM0dzDs
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vaibhav Suryavanshi | టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీ..? బీసీసీఐ కార్యదర్శి ఏమన్నారంటే..!
- ●India US Trade Deal | భారత్-అమెరికా మెగా ట్రేడ్ డీల్ రెడీ: 99 శాతం చర్చలు పూర్తి.. త్వరలోనే గుడ్‌న్యూస్
- ●Rashmika Mandanna | రష్మిక తగ్గేదేలే ... బాలీవుడ్ సినిమాకు నేషనల్ క్రష్ రెమ్యూనరేషన్ చూస్తే మైండ్ బ్లాకే!
- ●Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రేపు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
- ●Supreme Court | సీబీటీ విధానం కుదరదు.. నీట్ రీ ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- ●HCA | హెచ్‌సీఏ నిధుల అక్రమాలపై సిట్ దర్యాప్తు.. త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న సిట్..!

Vaibhav Suryavanshi | టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీ..? బీసీసీఐ కార్యదర్శి ఏమన్నారంటే..!

India US Trade Deal | భారత్-అమెరికా మెగా ట్రేడ్ డీల్ రెడీ: 99 శాతం చర్చలు పూర్తి.. త్వరలోనే గుడ్‌న్యూస్

Rashmika Mandanna | రష్మిక తగ్గేదేలే ... బాలీవుడ్ సినిమాకు నేషనల్ క్రష్ రెమ్యూనరేషన్ చూస్తే మైండ్ బ్లాకే!

Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రేపు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!






