TG Weather | తెలంగాణ వాసులకు ఐఎండీ గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో నాలుగైదు రోజులు వర్షాలు..!
TG Weather | తెలంగాణలో రాగల నాలుగైదు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని పలుప్రాంతాలు, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని ప్రాంతాల్లో మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
TG Weather | తెలంగాణలో రాగల నాలుగైదు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ ఆరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని పలుప్రాంతాలు, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని ప్రాంతాల్లో మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతం పైనున్న ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా శ్రీలంక తీరాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది.
ఈ క్రమంలో తెలంగాణలో రాగల నాలుగైదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఈదురుగాలులతో కూడిన వానలు పడేందుకు అవకాశం ఉందని వివరించింది. అలాగే, బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. నాలుగురోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గుతాయని తెలిపింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●RCB Players Net Worth 2026 | ఐపీఎల్ 2026 ఛాంపియన్స్ 'RCB' ప్లేయర్ల ఆస్తుల చిట్టా: విరాట్ కోహ్లీ సంపాదన చూస్తే షాకే!
- ●Hyderabad | పరారీలో ఉన్న నేపాలీలను అరెస్టు చేసేందుకు రంగంలోకి సిట్ బృందం..!
- ●HMWSSB | నగర ప్రజలకు శుభవార్త.. ఉచిత నీటి సరఫరా పథకం కొనసాగింపు
- ●Allam Narayana | ఆంధ్రోళ్ల విగ్రహాలు పెట్టడంలో ఆంతర్యమేంటి?: అల్లం నారాయణ
- ●Iran War | 20కిపైగా సైనిక స్థావరాలు ధ్వంసం.. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం
- ●Kinetics 8K | విద్యుత్ లేకపోయినా నెట్ ఆగదు.. పోర్ట్రానిక్స్ కొత్త కినెటిక్స్ 8కె మినీ యూపీఎస్ విడుదల..

RCB Players Net Worth 2026 | ఐపీఎల్ 2026 ఛాంపియన్స్ 'RCB' ప్లేయర్ల ఆస్తుల చిట్టా: విరాట్ కోహ్లీ సంపాదన చూస్తే షాకే!

Hyderabad | పరారీలో ఉన్న నేపాలీలను అరెస్టు చేసేందుకు రంగంలోకి సిట్ బృందం..!

HMWSSB | నగర ప్రజలకు శుభవార్త.. ఉచిత నీటి సరఫరా పథకం కొనసాగింపు

Allam Narayana | ఆంధ్రోళ్ల విగ్రహాలు పెట్టడంలో ఆంతర్యమేంటి?: అల్లం నారాయణ





