త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CID Chief Charu Sinha | ఆన్ లైన్ బెట్టింగ్‌పై సిట్ వేశాం.. 11 మందిని అరెస్ట్ చేశాం: సీఐడీ చీఫ్ చారుసిన్హా

CID Chief Charu Sinha | ఆన్‌లైన్ బెట్టింగ్‌ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేసింద‌ని.. పాన్ ఇండియా ఆప‌రేష‌న్ చేప‌ట్టి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమింగ్ నిర్వహిస్తున్న 11 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు సీఐడీ చీఫ్ చారుసిన్హా తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్స్ కు ఒక్క చాన్స్ ఇచ్చామ‌ని చెప్పారు.

S

Telangana | Published On Jun 1, 2026, 3.42 pm IST

CID Chief Charu Sinha | ఆన్ లైన్ బెట్టింగ్‌పై సిట్ వేశాం.. 11 మందిని అరెస్ట్ చేశాం: సీఐడీ చీఫ్ చారుసిన్హా
Advertisement
  • పాన్ ఇండియా ఆపరేషన్ చేసి ప‌ట్టుకున్నాం
  • ఇది ఇంటర్నేషనల్ బెట్టింగ్ దందా
  • సెల‌బ్రిటీల‌కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపాం
  • రాష్ట్రంలో 414 కేసులు న‌మోద‌య్యాయి
  • సీఐడీ చీఫ్ చారుసిన్హా వెల్ల‌డి

CID Chief Charu Sinha | త్రినేత్ర‌.న్యూస్: ఆన్‌లైన్ బెట్టింగ్‌ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేసింద‌ని.. పాన్ ఇండియా ఆప‌రేష‌న్ చేప‌ట్టి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమింగ్ నిర్వహిస్తున్న 11 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు సీఐడీ చీఫ్ చారుసిన్హా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్ అప్లికేషన్లపై 414 కేసులు నమోదు చేసిన‌ట్లు పేర్కొన్నారు. సోమ‌వారం ఆయ‌న వివరాల‌ను వెల్ల‌డించారు. ఆన్ లైన్ బెట్టింగ్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్స్ కు ఒక్క చాన్స్ ఇచ్చామ‌ని చెప్పారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చామ‌ని, రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

CID కి బదిలీ ఆయిన ఆన్ లైన్ బెట్టింగ్ కేసులను విచారణ చేస్తున్నాం. తెలంగాణా లో 414 కేసులు నమోదు, 108 బెట్టింగ్ యాప్ లు బ్లాక్ చేశాం. కరీంనగర్ లో నమోదైన డాఫా బెట్ కేసును CID ఛేదించింది. 40 మంది అధికారులు ఈ కేసును విచారణ చేశారు. 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ను సీజ్ చేశాం. 15 రోజుల ఆపరేషన్ లో ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ లో 11 మందిని అరెస్ట్ చేశాం. ఇది ఒక ఇంటర్నేషనల్ బెట్టింగ్ దందా. ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో పాన్ ఇండియా ఆపరేషన్ చేసి నిందితులను అరెస్ట్ చేశాం. ఈ డాఫా బెట్ పై 8 రాష్ట్రాల్లో 225 ఫిర్యాదులు 73 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి అని చారుసిన్హా వెల్ల‌డించారు.

108 ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్ గుర్తించి భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఈ కేసులో ఆన్ లైన్ బెట్టింగ్ ద్వారా ఆర్గ‌నైజర్లు రోజుకు 8 నుండి 10 లక్షలు సంపాదిస్తున్నారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సమన్వయంతో 37 ఆన్‌లైన్‌ బెట్టింగ్ అప్లికేషన్లు ఉన్నాయి. తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉండేలా జియో ఫెన్సింగ్ ఏర్పాటైంది. 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్సూరెన్స్ లను కౌన్సిలింగ్ చేశాం.

తెలంగాణా లో 414 కేసులు నమోదు, 108 బెట్టింగ్ యాప్ లు బ్లాక్ చేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్లపై 414 కేసులు నమోదు చేశాం. 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర‌ల్ల‌ను కౌన్సింగ్ చేశాం అని చారుసిన్హా పేర్కొన్నారు.

నిందితుల్లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్లు సమాచారం. అరెస్టు అయిన వారిలో నిర్వాహకులు వారి సహాయకులు ఉన్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి భారీగా బెట్టింగ్ నిర్వాహణకు వినియోగించే పరికరాలు, మొబైల్స్, లాప్టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. మరికాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టునున్నట్లు సీఐడీ చీఫ్ తెలిపారు.

Advertisement
Advertisement