Raghunandan Rao | తన కుర్చీ కిందకు నీళ్లు తెస్తున్నారనే.. అమెరికా పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
Raghunandan Rao | సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు నెలలో ముఖ్యమంత్రులు ఎవరైనా అమెరికా వెళ్తే వారు తిరిగి వచ్చేలోపు సీఎం కుర్చీ ఉంటుందో లేదో తెలియదని ఎద్దేవా చేశారు.
Raghunandan Rao | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను విదేశాల్లో ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీ ఎమ్మెల్యేలు రోజుకో రంగా మాట్లాడుతున్నారని, రోజుకో పంచాయితీ పెడుతున్నారని ముఖ్యమంత్రి (Revanth Reddy) భయపడుతున్నారని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆగస్టు నెలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ఆగస్టు నెలలో ముఖ్యమంత్రులు ఎవరైనా అమెరికా వెళ్తే వారు తిరిగి వచ్చేలోపు సీఎం కుర్చీ ఉంటుందో లేదో తెలియదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ హయాం నుంచి ఈ పరిస్థితి ప్రారంభమైందని, అప్పట్లో పచ్చ పార్టీలో(TDP) ఇది మొదలైందని వెల్లడించారు. రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తేనని వ్యాఖ్యానించారు.
ఇదే విషయమై ఎవరో రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చి ఉంటారని, ఆయన మంత్రులుగా చేసినవారు.. అలాగే పదవులు ఇవ్వని వారు తన కుర్చీ కింద నీళ్లు తెస్తున్నారని, అందరూ కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి ఉండొచ్చని చెప్పారు. అందుకే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను (America Tour) రద్దు చేసుకుని తిరిగి వస్తున్నారని వ్యాఖ్యానించారు. యూకే (UK) వెళ్లేందుకు అనుమతి ఇచ్చినవారు అమెరికా వెళ్లేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. తమకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
సంబంధిత వార్తలు

Harish Rao | నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు
ఆగస్టు 22, 2026

RS Praveen Kumar | సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతించని కేంద్రం.. నిజాలు నిగ్గు తేల్చాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆగస్టు 22, 2026

బర్తరఫ్ చేస్తారా.. సైలెంట్ ఆపరేషన్ నడుపుతారా? కొండా వర్గంపై సీఎం రేవంత్ పొలిటికల్ స్కెచ్!
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Rajasthan Schools | సీజేపీ తనిఖీలతో వెలుగులోకి రాజస్థాన్ ప్రభుత్వ బడుల దుస్థితి.. 611 పాఠశాలలకు సొంత భవనాలు లేవని అంగీకరించిన సర్కార్
- ●PPF | పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తెరవచ్చా.. ఏమేం సదుపాయాలు ఉంటాయి..?
- ●Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్ల వైపు పెట్టుబడిదారుల చూపులు..
- ●Harish Rao | నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు
- ●Smart Meter | కరెంటు మీటర్లు మార్చుకోవాల్సిందేనా?
- ●Madhur Knit Crafts | రూ.53.28 కోట్లతో మధుర్ నిట్ క్రాఫ్ట్స్ ఐపీఓ.. వివరాలు ఇవే..

Rajasthan Schools | సీజేపీ తనిఖీలతో వెలుగులోకి రాజస్థాన్ ప్రభుత్వ బడుల దుస్థితి.. 611 పాఠశాలలకు సొంత భవనాలు లేవని అంగీకరించిన సర్కార్

PPF | పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తెరవచ్చా.. ఏమేం సదుపాయాలు ఉంటాయి..?

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్ల వైపు పెట్టుబడిదారుల చూపులు..

Harish Rao | నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు



