త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jannaram | ఇంటి నెంబ‌ర్ కోసం డ‌బ్బులు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి

Jannaram | ఇంటి నిర్మాణానికి అనుమతి, కొత్తగా నిర్మించిన ఇంటికి నంబర్‌ కేటాయించేందుకు రూ.13 వేల లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాపూర్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జే వరలక్ష్మిని అరెస్టు చేసినట్లు ఏసీబీ తెలిపింది.

P

Telangana | Published On Aug 21, 2026, 5.14 pm IST

Jannaram | ఇంటి నెంబ‌ర్ కోసం డ‌బ్బులు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి
Advertisement

Jannaram | ఇంటి నిర్మాణానికి అనుమతి, కొత్తగా నిర్మించిన ఇంటికి నంబర్‌ కేటాయించేందుకు రూ.13 వేల లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాపూర్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జే వరలక్ష్మిని అరెస్టు చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి నుంచి తొలుత రూ.20వేలు లంచం డిమాండ్‌ చేసిన వరలక్ష్మి.. చర్చల అనంతరం రూ.13వేలు తీసుకునేందుకు అంగీకరించారు. ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో నగదు తీసుకోకుండా ఫోన్‌పే ద్వారా డబ్బు పంపాలని సూచించారు. మరో పంచాయతీ కార్యదర్శి లావణ్యకు చెందిన ఫోన్‌పే నంబర్‌ను ఫిర్యాదుదారుడికి ఇచ్చారు.

ఆమె సూచన మేరకు ఫిర్యాదుదారుడు రూ.13 వేలను ఆ ఖాతాకు బదిలీ చేసిన‌ట్లుగా ఏసీబీ పేర్కొంది. లంచం డిమాండ్‌, చెల్లింపునకు సంబంధించిన ఆధారాలను అధికారులు నమోదు చేశారు. అధికారిక హోదాను దుర్వినియోగం చేసి అనుచిత ప్రయోజనం పొందినందుకు వరలక్ష్మిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. తెలంగాణ ఏసీబీ వాట్సాప్‌ నంబర్‌ 9440446106కు కూడా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.

Advertisement
Advertisement