Harish Rao | విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తరా రేవంత్? వాళ్ల మీద చేయేస్తే చూస్తూ ఉండం
Harish Rao | విద్యార్థులను గొంతు పిసికి చంపేసే ప్రయత్నం చేస్తున్నారని.. పోలీసులకు సీఎం రేవంత్ ఇచ్చే ఆదేశాలు ఇవేనా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహించారు. ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కితే.. ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు.
- ఇవేనా మీరు పోలీసులకిచ్చిన ఆదేశాలు
- పోలీసుల దమనకాండను వెంటనే ఆపాలి
- మహబూబాబాద్ ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
Harish Rao | త్రినేత్ర.న్యూస్: విద్యార్థులను గొంతు పిసికి చంపేసే ప్రయత్నం చేస్తున్నారని.. పోలీసులకు సీఎం రేవంత్ ఇచ్చే ఆదేశాలు ఇవేనా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహించారు. ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కితే.. ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. మహబూబాద్ జిల్లాలలో బుధవారం విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై డీజీపీ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఫైరయ్యారు.
ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే లాఠీలు.. హక్కుల కోసం రోడ్డెక్కితే అణచివేతలా? విద్యార్థులన్నా, నిరుద్యోగులన్నా ఎందుకంత కక్ష రేవంత్ రెడ్డి? వెంటనే పోలీసు దమనకాండను ఆపాలి. విద్యార్థులపై చేయి పడితే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించడంతో పాటు, మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తారా @revanth_anumula .?
ఇదేనా మీరు పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు?
‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కితే.. ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?
ప్రశ్నిస్తే కేసులు..
నిరసిస్తే లాఠీలు..
హక్కుల కోసం… pic.twitter.com/ZVrdHVa2Ci— Harish Rao Thanneeru (@BRSHarish) August 19, 2026
సంబంధిత వార్తలు

Konda Susmitha | రేవంత్.. నువ్వొచ్చినా, రేవూరి తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యే నేనే
ఆగస్టు 19, 2026

Ramchandar Rao | ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించాలి.. 16 రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోరా?
ఆగస్టు 19, 2026

Telangana Govt | సినిమా టికెట్ రేట్లు పెంచితే 20శాతం సంక్షేమానికి.. సర్కారు కీలక ఆదేశాలు..!
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు
- ●నబీన్ మార్క్ ‘షాక్ థెరపీ’… తెలంగాణ బీజేపీకి ఢిల్లీ పీఠంలో ‘జీరో’ దక్కడానికి 5 కారణాలు ఇవే!
- ●State Museum | వైఎస్సార్ స్టేట్ మ్యూజియానికి పూర్వ వైభవం
- ●Ritika Nayak | కథ నచ్చితేనే ఓకే.. రితికా నాయక్ ప్లాన్ ఇదే
- ●WhatsApp Cyber Fraud | వాట్సప్‌లో 'బాస్' మెసేజ్.. ఏకంగా రూ.1 కోటి కొల్లగొట్టిన కేటుగాడు, పోలీసుల ఎంట్రీతో ఊహించని ట్విస్ట్
- ●Konda Susmitha | రేవంత్.. నువ్వొచ్చినా, రేవూరి తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యే నేనే

CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు

నబీన్ మార్క్ ‘షాక్ థెరపీ’… తెలంగాణ బీజేపీకి ఢిల్లీ పీఠంలో ‘జీరో’ దక్కడానికి 5 కారణాలు ఇవే!

State Museum | వైఎస్సార్ స్టేట్ మ్యూజియానికి పూర్వ వైభవం

Ritika Nayak | కథ నచ్చితేనే ఓకే.. రితికా నాయక్ ప్లాన్ ఇదే



