Telangana Govt | సినిమా టికెట్ రేట్లు పెంచితే 20శాతం సంక్షేమానికి.. సర్కారు కీలక ఆదేశాలు..!
Telangana Govt | సినిమా టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని సంక్షేమ విరాళంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు చెల్లించాలని సినీ నిర్మాతలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిధులను తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి వినియోగించనున్నట్లు స్పష్టం చేసింది.
Telangana Govt | సినిమా టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని సంక్షేమ విరాళంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు చెల్లించాలని సినీ నిర్మాతలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిధులను తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి వినియోగించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. టికెట్ ధరల పెంపుతో లభించే అదనపు రాబడిపై 20 శాతం మొత్తాన్ని సంబంధిత చిత్రాల నిర్మాతలు ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేయాలి. అనంతరం ఆ మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య సంక్షేమ సంఘం ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.
ఈ ఖాతాను టీజీఎఫ్‌డీసీ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ నిబంధన ‘అఖండ-2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు వస్తున్నారు’, ‘పెద్ది’ చిత్రాలకు వర్తించనుంది. ఆయా సినిమాల నిర్మాతలు ఎగ్జిబిటర్ల నుంచి 20 శాతం సంక్షేమ విరాళాన్ని సేకరించి ప్రభుత్వం నిర్దేశించిన ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్స్ ఇండియా, వృద్ధి సినిమాస్ సంస్థలకు ప్రభుత్వం లేఖలు పంపింది. టికెట్ ధరల పెంపుతో వచ్చిన అదనపు ఆదాయంలో నిర్ణయించిన 20 శాతం మొత్తాన్ని ఎగ్జిబిటర్ల నుంచి సేకరించి, టీజీఎఫ్‌డీసీ ద్వారా నిర్వహించే సంక్షేమ సంఘం ఖాతాలో జమ చేయాలని హోం శాఖ ఆదేశించింది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత నిర్మాతలను కోరింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్స్ కేసు.. నిధి అగర్వాల్‌ను విచారించిన ఈడీ
ఆగస్టు 19, 2026

Bhatti Vikramarka | బ్యాంకులే రైతుల వద్దకెళ్లి రుణాలు ఇవ్వాలి.. వారి ఆదాయం పెరిగేలా రుణ విధానాలుండాలి
ఆగస్టు 19, 2026

Priya Bhavani Shankar | ‘ఇరుముడి’తో ప్రియా భవానీ శంకర్‌కు తెలుగులో బ్రేక్ వచ్చేనా?
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Photo Journalists | ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి.. ప్రకృతి అందాలను ఫొటోల్లో బంధించండి
- ●Kavitha Name Change | కవిత.. పేరు మార్చుకోవాల్సిందే..!
- ●22A Lands Issue Telangana | 22A భూముల బాధితులకు అభయం.. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ 'ఫ్రీ లీగల్ సెల్' : ఫోన్ నెంబర్ ఇదే!
- ●Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్స్ కేసు.. నిధి అగర్వాల్‌ను విచారించిన ఈడీ
- ●Abhijeet Dipke | నిరుపయోగంగా ఉన్న పీఎం కేర్స్ నిధులను పాఠశాలల అభివృద్ధికి ఉపయోగించండి : అభిజీత్ దిప్కే
- ●Bhatti Vikramarka | బ్యాంకులే రైతుల వద్దకెళ్లి రుణాలు ఇవ్వాలి.. వారి ఆదాయం పెరిగేలా రుణ విధానాలుండాలి

Photo Journalists | ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి.. ప్రకృతి అందాలను ఫొటోల్లో బంధించండి

Kavitha Name Change | కవిత.. పేరు మార్చుకోవాల్సిందే..!

22A Lands Issue Telangana | 22A భూముల బాధితులకు అభయం.. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ 'ఫ్రీ లీగల్ సెల్' : ఫోన్ నెంబర్ ఇదే!

Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్స్ కేసు.. నిధి అగర్వాల్‌ను విచారించిన ఈడీ



