Ramchandar Rao | ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించాలి.. 16 రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోరా?
Ramchandar Rao | అల్లోపతి విద్యార్థులతో సమానంగా ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌తో పాటు బకాయిలు చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. విద్యార్థులు తమ హక్కుల కోసం 16 రోజులుగా దీక్షలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం సిగ్గుచేటన్నారు.
- ఆంధ్రాలో 60 వేలు ఇస్తే.. తెలంగాణలో 30 వేలే ఇస్తున్నరు
- బీఆర్ఎస్ హయాంలో ఇదే రేవంత్‌రెడ్డి చెల్లించాలని మాట్లాడిండు.. అధికారమొచ్చాక సప్పుడు లేదు
- అల్లోపతి విద్యార్థులతో సమానంగా స్టైపెండ్‌తో పాటు బకాయిలు విడుదల చేయాలి
- ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాలలో దీక్ష చేస్తున్న విద్యార్థులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సంఘీభావం
Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: అల్లోపతి విద్యార్థులతో సమానంగా ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌తో పాటు బకాయిలు చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. విద్యార్థులు తమ హక్కుల కోసం 16 రోజులుగా దీక్షలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం సిగ్గుచేటన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఏపీ తరహాలోనే తెలంగాణలో అమలు చేయాలన్నారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాలలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్థులకు ఆయన బుధవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజారోగ్య పరిరక్షణలో అల్లోపతి వైద్యులతో సమానంగా అహర్నిశలు సేవలందిస్తున్న ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ విషయంలో తీవ్ర వివక్ష చూపడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయుష్ పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లకు స్టైపెండ్‌ను పెంచి, పెండింగ్ ఎరియర్స్‌తో సహా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్య రక్షణలో కీలక సేవలందిస్తున్న ఆయుష్ వైద్య విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే గుర్తించి, పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.
2016 నుంచి నిలిపేశారు..
ఆయుర్వేద, యునాని, హోమియోపతి వంటి భారతీయ వైద్య విధానాల్లో సేవలందిస్తున్న పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు స్టైపెండ్ పెంచకుండా అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం భారతీయ వైద్య రంగం (ఆయుష్), అల్లోపతి వైద్య విద్యార్థులను సమానంగా చూడాలనే నిబంధన ఉందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2016 నుంచి ఈ స్టైపెండ్‌ను నిలిపివేయడం శోచనీయమన్నారు.
ఆంధ్రాలో రూ.60 వేలు.. తెలంగాణలో 30 వేలే..
అల్లోపతి వైద్య విద్యార్థుల మాదిరిగానే ఆయుష్ పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, ఇంటర్న్‌షిప్ చేస్తున్న వారికి సమానంగా స్టైపెండ్ చెల్లించాలని న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ పీజీ విద్యార్థులకు నెలకు రూ. 60 వేలు, హౌస్ సర్జన్లకు రూ. 25 వేలు చొప్పున స్టైపెండ్ చెల్లిస్తుంటే, తెలంగాణలో మాత్రం పీజీ విద్యార్థులకు కేవలం రూ. 30 వేలు, హౌస్ సర్జన్లకు రూ. 13 వేలు మాత్రమే ఇవ్వడం తీవ్ర వివక్షాపూరితమని మండిపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రత్యేకంగా 'ఆయుష్' మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, అన్ని వైద్య విభాగాలను సమానంగా ప్రోత్సహిస్తూ వైద్య విద్యకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయుష్ వైద్యులకు సమాన స్టైపెండ్ అమలు చేయాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేసిన నేటి ఉపముఖ్యమంత్రి, ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న ఎరియర్స్‌తో సహా ఏపీ తరహాలో పూర్తి స్థాయి స్టైపెండ్‌ను తక్షణమే చెల్లించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
పోరాటాన్ని ఉధృతం చేస్తాం..
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ల్యాండ్ మాఫియా, భూ ఆక్రమణలపైనే దృష్టి సారిస్తూ, ప్రజా సేవ చేసే వైద్య విద్యార్థుల సమస్యలను, విద్యా రంగాన్ని పూర్తిగా విస్మరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఆయుష్ విద్యార్థులకు అల్లోపతితో సమానంగా స్టైపెండ్ పెంచి, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన బీజేపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని రాంచందర్ రావు హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Telangana Govt | సినిమా టికెట్ రేట్లు పెంచితే 20శాతం సంక్షేమానికి.. సర్కారు కీలక ఆదేశాలు..!
ఆగస్టు 19, 2026

Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్స్ కేసు.. నిధి అగర్వాల్‌ను విచారించిన ఈడీ
ఆగస్టు 19, 2026

Bhatti Vikramarka | బ్యాంకులే రైతుల వద్దకెళ్లి రుణాలు ఇవ్వాలి.. వారి ఆదాయం పెరిగేలా రుణ విధానాలుండాలి
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Gold Prices | ఆగస్టులో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా..?
- ●Cabinet Decisions | రూ. 9,450 కోట్ల భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. ఏపీకి దక్కిన ప్రాధాన్యం
- ●Telangana Govt | సినిమా టికెట్ రేట్లు పెంచితే 20శాతం సంక్షేమానికి.. సర్కారు కీలక ఆదేశాలు..!
- ●Photo Journalists | ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి.. ప్రకృతి అందాలను ఫొటోల్లో బంధించండి
- ●Kavitha Name Change | కవిత.. పేరు మార్చుకోవాల్సిందే..!
- ●22A Lands Issue Telangana | 22A భూముల బాధితులకు అభయం.. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ 'ఫ్రీ లీగల్ సెల్' : ఫోన్ నెంబర్ ఇదే!

Gold Prices | ఆగస్టులో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా..?

Cabinet Decisions | రూ. 9,450 కోట్ల భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. ఏపీకి దక్కిన ప్రాధాన్యం

Telangana Govt | సినిమా టికెట్ రేట్లు పెంచితే 20శాతం సంక్షేమానికి.. సర్కారు కీలక ఆదేశాలు..!

Photo Journalists | ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి.. ప్రకృతి అందాలను ఫొటోల్లో బంధించండి






