Harish Rao | ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్‌రెడ్డి?
Harish Rao | పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకుండా బకాయిలు పేరుకుపోయేలా చేస్తున్నారని విమర్శించారు. ‘
- బకాయిలు, జీతాలు చెల్లించడంలో వైఫల్యం
- సిబ్బంది ఆవేదన వెంటే గుండె కలచివేస్తోంది
- ఒకటో తేదీకే వేతనాలు ఇస్తామన్న హామీ ఏమైంది
- మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao | పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకుండా బకాయిలు పేరుకుపోయేలా చేస్తున్నారని విమర్శించారు. ‘‘ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్‌రెడ్డి?’’ అని ప్రశ్నించారు. సదరు విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 18 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి వేతనాలు లేకుండా సిబ్బంది, వారి కుటుంబాలు ఎలా బతకాలి? పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించాలి? అని ప్రశ్నించారు. ప్రతి నెలా ఒకటో తేదీకే వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. బీఆర్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ను ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఆదివారం కలిసి జీతాలు ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు.
సిద్ధిపేటలో రూ.24 కోట్ల బకాయిలు?
సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు 2023 నవంబరు నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ నిధులు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని హరీశ్‌రావు ఆరోపించారు. దాదాపు రూ.24 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. నిధులు విడుదల కాకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ, రోగుల సంరక్షణ, మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులకు కూడా నెలల తరబడి బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. బకాయిలు పేరుకుపోతే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వేతనాలు, మందులు, పరికరాల కొనుగోళ్లు, ఆసుపత్రుల నిర్వహణపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని చెప్పారు.
రూ.10 లక్షల కవరేజీ ఏమైంది?
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించిందని, ఆచరణలో మాత్రం అది ప్రకటనలకే పరిమితమైందని హరీశ్‌రావు విమర్శించారు. ఒకవైపు కవరేజీ పెంచామని చెప్పుకుంటూ.. మరోవైపు ఆరోగ్యశ్రీ వ్యవస్థను రోజురోజుకూ బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. బకాయిలు పేరుకుపోయి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించడమే ఆసుపత్రులకు భారంగా మారితే.. చివరకు నష్టపోయేది ఎవరు? పేద రోగులే కదా? అని ప్రశ్నించారు. పేద ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆరోగ్యశ్రీకి నిధుల కొరత ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బకాయిలు విడుదల చేయాలి
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మధ్య ఎలాంటి తేడా చూపకుండా సీనియారిటీ, ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించిన ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న రూ.1,400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న సిబ్బంది జీతాలను తక్షణమే చెల్లించాలని కోరారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే చర్యలను ప్రభుత్వం ఆపాలని.. పేదల ప్రాణాధారమైన ఈ పథకాన్ని కాపాడాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mahesh Goud | కార్యకర్తల వల్లే కాంగ్రెస్‌కు అధికారం.. పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ఆగస్టు 23, 2026

Indefinite Strike | అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్..
ఆగస్టు 23, 2026

Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ అప్‌గ్రేడ్.. ఇక 24 బోగీలతో పరుగులు..!
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●IOCL Recruitment | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్‌లు.. సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తులు
- ●Chiranjeevi | మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్ - ట్రెడిషనల్ థీమ్‌తో....
- ●Indefinite Strike | అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్..
- ●Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ - రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్
- ●Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
- ●Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు

IOCL Recruitment | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్‌లు.. సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తులు

Chiranjeevi | మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్ - ట్రెడిషనల్ థీమ్‌తో....

Indefinite Strike | అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్..

Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ - రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్



