Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
Gachibowli Building Collapse | హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో (Gachibowli Building Collapse) ఏడు అంతస్థుల భవనం కూలిన ఘటనలో టౌన్‌ప్లానింగ్ అధికారిపై (TPO) ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మాదాపూర్ టీపీవో సంతోశ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఉత్తర్వులు జారీచేసింది.
Gachibowli Building Collapse | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో (Gachibowli Building Collapse) ఏడు అంతస్థుల భవనం కూలిన ఘటనలో టౌన్‌ప్లానింగ్ అధికారిపై (TPO) ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మాదాపూర్ టీపీవో సంతోశ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఉత్తర్వులు జారీచేసింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. అనుమతులు లేకుండా ఏడంతుస్తుల భవనాన్ని నిర్మించినందుకుగాను భవన యజమానులు ఫర్హీన్ సిద్దిక్, సాజిద్‌పై సీఎంసీ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేశారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు
మరోవైపు ఘటనా స్థలంలో సహాయక చర్యలు (Rescue Operations) కొనసాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది శిథిలాలు తొలగిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉండొచ్చనే అనుమానంతో గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు చనిపోయారు. వారి మృతదేహాలను శనివారమే వెలికితీసిన విషయం తెలిసిందే. ఇక భవనం యజమాని, బిల్డర్ సయ్యద్ సాజిద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంజయ్యనగర్‌లో కేవలం 38 గజాలకు మరో 10 గజాల నాలాను ఆక్రమించి 48 గజాల్లో ఏడంతస్తుల మేడను నిర్మిస్తున్నాడు. ప్రమాదం గురించి తెలియగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, తప్పించుకుని తిరుగుతున్నాడు.
కాగా, ఏడు అంతస్తుల భవనం కూలినప్పుడు శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో అది కూడా దెబ్బతింది. దీంతో ఆ అపార్ట్‌మెంట్‌ను కూడా హైడ్రా (HYDRAA) అధికారులు కూల్చేయనున్నారు. అందులో ఉన్న వారిని అధికారులు ఇప్పటికే ఖాళీ చేయించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు
- ●Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- ●Nayanthara | నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే? - సీక్రెట్ రివీల్ చేసిన లేడీ సూపర్ స్టార్
- ●Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ అప్‌గ్రేడ్.. ఇక 24 బోగీలతో పరుగులు..!
- ●Laptop Catches Fire | విమానం ల్యాండ్ అవుతుండగా.. ల్యాప్‌టాప్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
- ●Cargo Ship | ఒడిశాతీరంలో నీట మునిగిన కార్గో నౌక.. 22 మంది గల్లంతు

Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు

Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

Nayanthara | నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే? - సీక్రెట్ రివీల్ చేసిన లేడీ సూపర్ స్టార్

Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ అప్‌గ్రేడ్.. ఇక 24 బోగీలతో పరుగులు..!






