Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ – రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్
మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న వారణాసి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ టైమ్ ట్రావెల్ మూవీ 120 దేశాల్లో రిలీజ్ కాబోతుంది. ఆయా దేశాల ఆడియెన్స్ తమ మాతృభాషలోనే ఈ సినిమా చూసేలా రాజమౌళి పెద్ద ప్లాన్ చేసినట్లు సమాచారం. యాభై ప్రపంచ భాషల్లోకి ఈ సినిమాను డబ్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
Entertainment | Published On Aug 23, 2026, 10.50 am IST
Varanasi Movie | మహేష్‌బాబు హీరోగా నటిస్తోన్న వారణాసిని హాలీవుడ్ సినిమాలకు ధీటుగా రిలీజ్ చేయబోతున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్‌పై కన్నేసిన జక్కన్న ఇంగ్లీష్‌తో పాటు పలు ప్రపంచ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చేస్తున్నారు.
రామాయణం...
టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా వారణాసి తెరకెక్కుతోంది. ఇందులో రుద్ర అనే ఆర్కియాలజిస్ట్‌గా, శ్రీరాముడిగా మహేష్‌బాబు కనిపించబోతున్నారు. ఓ భారీ అస్టరాయిడ్ కారణంగా ఏర్పడిన ముప్పు నుంచి భూమితో పాటు మానవాళిని ఓ ధైర్యవంతుడైన ఆర్కియాలజిస్ట్ ఎలా కాపాడదనే అంశాలతో ఈ సినిమా రూపొందుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. టైమ్ ట్రావెల్ ద్వారా రామాయణ కాలానికి అతడు ఎందుకు వెళ్లాల్సివచ్చిందనే అంశాలతో వారణాసి కథ సాగనుంది.
హాలీవుడ్ స్టూడియోలతో...
వారణాసి షూటింగ్ 90 శాతం వరకు పూర్తయ్యింది. అక్టోబర్ నెలాఖరుకు ఈ సినిమాకు మహేష్‌బాబు ప్యాకప్ చెప్పబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నాయి. ఈ సినిమా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనుల కోసం పలు హాలీవుడ్ స్టూడియోలతో రాజమౌళి డీల్ కుదుర్చుకున్నారు. కంప్లీట్ ఐ మాక్స్ ఫార్మెట్‌లో రాజమౌళి ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫార్మెట్‌లో తెరకెక్కుతోన్న ఫస్ట్ ఇండియన్ మూవీగా వారణాసి రికార్డ్ క్రియేట్ చేయబోతుంది.
120 దేశాల్లో....యాభై భాషల్లో రిలీజ్...
వరల్డ్ సినిమా లవర్స్‌కు వారణాసిని చేరువ చేసేందుకు రాజమౌళి పెద్ద ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇండియాతో పాటు మొత్తం 120 దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఆయా దేశాల ఆడియెన్స్ వారణాసిని తమ మాతృభాషలోనే చూసేలా దాదాపు యాభై భాషల్లోకి ఈ సినిమాను డబ్ చేయబోతున్నట్లు సమాచారం. ఏఐపై ఆధారపడకుండా వివిధ దేశాలకు చెందిన ఆర్టిస్ట్‌లతోనే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పించాలని రాజమౌళి అనుకుంటున్నట్లు తెలిసింది. ఏఐ వాడితే ఒరిజినాలిటీ మిస్సవుతుందని , విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతోనే జక్కన్న ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం. వివిధ దేశాలకు చెందిన మొత్తం 1500 మంది డబ్బింగ్ ఆర్టిస్ట్‌లతో రాజమౌళి అండ్ టీమ్ డిస్కషన్స్ జరుపుతున్నట్లు సమాచారం.
ప్రియాంక చోప్రా...
వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలోకి రాబోతుంది.
సంబంధిత వార్తలు

Bahubali | బాహుబలి ఎటర్నల్ వార్‌లో మెగా హీరో – కన్ఫామ్ చేసిన లావణ్య త్రిపాఠి
ఆగస్టు 9, 2026

Mahesh Babu | నమ్రత క్యూట్ – ప్రియాంక చోప్రా అడ్వెంచరస్ – మహేష్‌బాబుకు ఎవరెలా బర్త్‌డే విషెస్ చెప్పారంటే?
ఆగస్టు 9, 2026

Mahesh Babu | మహేశ్ బాబు బర్త్‌డే స్పెషల్.. అదిరిపోయే లుక్‌లో రుద్ర..
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●Indefinite Strike | అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్..
- ●Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
- ●Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు
- ●Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- ●Nayanthara | నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే? - సీక్రెట్ రివీల్ చేసిన లేడీ సూపర్ స్టార్
- ●Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ అప్‌గ్రేడ్.. ఇక 24 బోగీలతో పరుగులు..!

Indefinite Strike | అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్..

Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు

Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం



