Ramchander Rao | వందేమాతరాన్ని అవమానిస్తుంటే కాంగ్రెస్ మౌనమెందుకు
Ramchander Rao | అసెంబ్లీ (Assembly) సాక్షిగా వందేమాతరాన్ని అవమానిస్తుంటే కాంగ్రెస్ మౌనమెందుకు వహించిందని బీజేపీ (BJP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు (Ramchander Rao) ప్రశ్నించారు. అసెంబ్లీలో సోమవారం వందేమాతరం పాడుతుంటే ఎంఐఎం (MIM) ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారని, దీనిపై కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు.
లష్కరేతోయిబాను కాంగ్రెస్ సమర్థిస్తోందా
ప్రజల్లో భయభ్రాంతులను సృష్టించేందుకు ఆ పార్టీ యత్నిస్తోంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : అసెంబ్లీ (Assembly) సాక్షిగా వందేమాతరాన్ని అవమానిస్తుంటే కాంగ్రెస్ మౌనమెందుకు వహించిందని బీజేపీ (BJP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు (Ramchander Rao) ప్రశ్నించారు. అసెంబ్లీలో సోమవారం వందేమాతరం పాడుతుంటే ఎంఐఎం (MIM) ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారని, దీనిపై కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. వందేమాతరం అనేది దేశ స్వాతంత్ర పోరాట ఊపిరి అని గుర్తు చేశారు. దాన్ని అవమానిస్తే కాంగ్రెస్‌కు నోరు రాదా అని ఎద్దేవా చేశారు. రాంచందర్‌రావు సమక్షంలో ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాసంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
రాజ్యాంగ ఉల్లంఘనే..
అనంతరం రాంచందర్‌రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ సుపరిపాలన, దేశాభివృద్ధి పట్ల ఆకర్షితులై తెలంగాణలో బీజేపీలోకి చేరికలు భారీఎత్తున కొనసాగుతున్నాయని అన్నారు. తాము చిన్నప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పటి నుండి ఒక నినాదం ఉండేదని, "భారత్ మే రహనా హోగా తో వందేమాతరం కహనా హోగా" (భారత్‌లో ఉండాలంటే వందేమాతరం అనాల్సిందే).. కానీ ఈ వందేమాతరాన్ని అవమానపరిచిన మజ్లిస్ పార్టీ పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలని సూచించారు. అది వారి రాజ్యాంగబద్ధమైన కర్తవ్యమని గుర్తు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A కింద ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమిక ధర్మాలు, విధులు ఉంటాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధమైన విధులను విస్మరించి, దేశ వ్యతిరేక శక్తులకు వత్తాసు పలకడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరుగుతారని, ఆయనకు ఒకసారి ఆర్టికల్ 51A చదవమని చెప్పాలని హితవు పలికారు. అప్పుడు అసలు విషయం తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. దీనిపై కాంగ్రెస్‌ను నిలదీస్తామని ప్రకటించారు. పార్లమెంటులో ఒక ఎంపీ 'జై పాలస్తీనా' అంటే చప్పట్లు కొట్టిన కాంగ్రెస్.. భారత్ మాతాకీ జై అనడానికి సిగ్గుపడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయం పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు.
'రా'ను నిషేధించాలా..
ఆర్ఎస్ఎస్ (RSS)ను నిషేధించాలనే కాంగ్రెస్ డిమాండ్ విడ్డూరంగా ఉందని రాంచందర్‌రావు అన్నారు. అమెరికాకు చెందిన USCIRF అనే ఒక పక్షపాత సంస్థ రిపోర్టును పట్టుకుని కాంగ్రెస్ మాట్లాడుతోందని, అదే సంస్థ మన దేశ గూఢచారి సంస్థ 'రా' (RAW) ను కూడా బ్యాన్ చేయాలని సిఫార్సు చేసిందని చెప్పారు. మరి ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలంటున్న కాంగ్రెస్ పార్టీ.. మన దేశ రక్షణ సంస్థ అయిన 'రా' ని కూడా రద్దు చేయమంటుందా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లష్కరే తోయిబా కంటే హిందూ గ్రూపులే ప్రమాదకరమని ఆ రిపోర్ట్ చెబితే, కాంగ్రెస్ దాన్ని సమర్థిస్తోందని మండిపడ్డారు. అంటే కాంగ్రెస్ లష్కరే తోయిబాకు సపోర్ట్ చేస్తున్నదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్లు దేశాన్ని దోచుకుంది
కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుందని రాంచందర్‌రావు ఆరోపించారు. 60 సంవత్సరాల వారి పాలనను ప్రజలు చూసినందునే వారిని పక్కన పెట్టారని అన్నారు. అది తట్టుకోలేక నేడు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, గ్యాస్ స్టవ్‌లు, సిలిండర్లు తక్కువగా ఉన్నాయని, అవి తగ్గిపోతున్నాయని అబద్ధాలు చెబుతూ ప్రజల్లో భయభ్రాంతులను సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిందని చెప్పారు. గతంలో 12 స్థానాలు ఉంటే, ఇప్పుడు 22 సీట్లను గెలుచుకోవడం బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నికకావడం తమకు గర్వకారణమని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఎన్నికైనందుకు వారికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Chamala Kiran Kumar Reddy | బండి సంజయ్.. గత ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నదెవరు?: ఎంపీ చామల
ఆగస్టు 19, 2026

Raja Singh | తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు.. అందుకే జాతీయ కార్యవర్గంలో ఒక్కరికీ చోటు దక్కలే: ఎమ్మెల్యే రాజాసింగ్
ఆగస్టు 19, 2026

Danam Nagender | బీఆర్ఎస్కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేందర్
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..



