త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollam Mallaiah Yadav | కేసీఆర్‌పై చావు భాష మాట్లాడుతుంటే.. మ‌ల్లారెడ్డి చోద్యం చూస్తుండు

Bollam Mallaiah Yadav | గ‌త కొంత కాలంగా బీజేపీలో చేర‌తారంటూ ప్ర‌చారంలో ఉన్న మాజీ మంత్రి మ‌ల్లారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య‌యాద‌వ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ మేర‌కు ఆదివారం మ‌ల్ల‌య్య‌యాద‌వ్ ట్వీట్ చేశారు.

S

Telangana | Published On Jul 19, 2026, 4.29 pm IST

Bollam Mallaiah Yadav | కేసీఆర్‌పై చావు భాష మాట్లాడుతుంటే.. మ‌ల్లారెడ్డి చోద్యం చూస్తుండు
Advertisement
  • ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నం
  • ట్వీట్ వేదిక‌గా ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ విమ‌ర్శ‌

Bollam Mallaiah Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: గ‌త కొంత కాలంగా బీజేపీలో చేర‌తారంటూ ప్ర‌చారంలో ఉన్న మాజీ మంత్రి మ‌ల్లారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య‌యాద‌వ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఘ‌ట్‌కేస‌ర్‌లో శ‌నివారం నిర్వ‌హించిన అందెశ్రీ సంస్మ‌ర‌ణ స‌భ‌లో మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేస్తుంటే అదే వేదిక‌పై ఉన్న మ‌ల్లారెడ్డి చోద్యం చూడ‌డంపై మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఆదివారం మ‌ల్ల‌య్య‌యాద‌వ్ ట్వీట్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీలో
మల్లారెడ్డి గారికి మంత్రిగా
ఉన్నత స్థానం కల్పించి
రాజకీయంగా వారికి
ఎంతో గౌరవం ఇచ్చిండు
కేసీఆర్ గారు!

కానీ.. నిన్నటి సభలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అత్యంత నీచంగా దిగజారి
పెద్దాయన కేసీఆర్ గారిపై
చావు భాష మాట్లాడుతుంటే!

అదే వేదికపై వెనుక కూర్చొని
మౌనంగా చోద్యం చూడడం
మల్లారెడ్డి గారి విజ్ఞతకే
వదిలేస్తున్నాం!

Advertisement
Advertisement