Karne Prabhakar | సీఎం మాట్లాడితే మెదడుకు, మూతికి సంబంధమే ఉంటలే
Karne Prabhakar | ఎస్ఎల్‌బీసీపై సీఎం రేవంత్ మెదడుకు, మూతికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. నల్లగొండ సభను స్వ డబ్బా.. పర నిందగా మార్చుకున్నారని, సభ మొత్తం ఓ కామెడీ షో లా సాగిందని ఎద్దేవా చేశారు.
- నల్లగొండ సభను స్వ డబ్బా.. పర నిందగా మార్సుకున్నడు
- సభ మొత్తం కామెడీ షో లా నడిచింది
- కమీషన్ల కోసం కొన్ని శంకుస్థాపనలు చేస్తుండు
- రాజగోపాల్‌రెడ్డి మీటింగ్‌కు ఎందుకు రాలేదో సీఎం చెప్పాలి
- మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శలు
Karne Prabhakar | త్రినేత్ర.న్యూస్: ఎస్ఎల్‌బీసీపై సీఎం రేవంత్ మెదడుకు, మూతికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. నల్లగొండ సభను స్వ డబ్బా.. పర నిందగా మార్చుకున్నారని, సభ మొత్తం ఓ కామెడీ షో లా సాగిందని ఎద్దేవా చేశారు. హ్యామ్ రోడ్లు ఎన్ని కిలోమీటర్లు మంజూరయ్యాయో సీఎం, మంత్రులకు తెలియదన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీటింగ్‌కు ఎందుకు రాలేదో సీఎం చెప్పాలన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై ఫైరయ్యారు.
కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీస్తారని హౌజ్ అరెస్టు చేసి దుర్మార్గంగా వ్యవహరించారు. కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పు అని సీఎం మళ్లా అన్నడు. కేసీఆర్ హయాంలో మూడున్నర లక్షల కోట్ల నుంచి నాలుగు లక్షల కోట్లు అప్పు అయింది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ హయాంలో రెండు లక్షల కోట్ల అప్పు దాటింది.
ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా?
నల్లగొండ జిల్లాలో ధాన్యం రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి అయిందని సీఎం అంటున్నారు. ఒక్క ఎకరాకు అయినా ఈ రెండున్నరేళ్ల లో నీళ్లిచ్చారా? ఒక్క కాలువైనా తవ్వారా? ధాన్యం ఉత్పత్తిలో మీ పాత్ర ఏముంది? ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీళ్లు సూర్యపేట, కోదాడ దాకా వెళ్లాయంటే అది కేసీఆర్ ఘనతే. వరి దిగుబడి అందుకే పెరిగింది. మా మాజీ ఎమ్మెల్యేలు కాలువల తవ్వకాన్ని నిత్యం పర్యవేక్షించి పూర్తి చేసారు. అందుకే అంత వరి దిగుబడి సాధ్యమైంది. ఎస్‌ఎల్‌బీసీపై రేవంత్ రెడ్డి మెదడుకు మూతికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. రెండున్నరేళ్లలో వంద మీటర్లయినా సొరంగం తవ్వావా? అని ప్రభాకర్ ప్రశ్నించారు.
అమరుల ఆత్మలు ఘోషిస్తున్నయ్..
చంద్రబాబు నాయుడు దగ్గర బానిసలా ఊడిగం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడటమా?అమరుల ఆత్మలు రేవంత్ మాటలు విని ఘోషిస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును తిట్టడం తప్ప నల్లగొండకు సీఎం ప్రకటించింది ఏమీ లేదు. సర్వేలన్నీ తనకు వ్యతిరేకంగా వస్తుండటంతో సీఎం అసహనంతో మాట్లాడుతున్నారు. ప్రజలు కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కేవలం కమీషన్ల కోసమే కొన్ని ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ సొమ్ముతో సీఎం సభలు పెట్టి ప్రతిపక్షం మీద పడి ఏడుస్తున్నాడు. రేవంత్ తన భాష మార్చుకోకపోతే ప్రజల నుంచే తిరుగుబాటు తప్పదు అని మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ హెచ్చరించారు.
గురివింద గింజలా మట్లాడుతుండు: బాలరాజు యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
నిన్న నల్లగొండ సభ కాంగ్రెస్ నాయకుల పంచాయితీ సభగా మారింది. ఉద్యమంలో కలెక్షన్ల మీద పడ్డ రేవంత్ రెడ్డే అసలైన పాపాల భైరవుడు. కుటుంబ పాలన గురించి రేవంత్ మాట్లాడటమా? జానారెడ్డి ఇంట్లో ఇద్దరు, ఉత్తమ్ ఇంట్లో ఇద్దరు, కోమటిరెడ్డి ఇంట్లో ఇద్దరు చొప్పున ప్రజా ప్రతినిధులు ఉంటే అది కుటుంబ పాలన కాదా? నల్లగొండలో ఎక్కడ చూసినా కేసీఆర్ ఆనవాళ్లే కనిపిస్తాయి. రేషన్ కార్డులపై చర్చకు సిద్ధం. తెలంగాణ కోసం జైలుకు వెళ్లిన చరిత్ర మా నాయకులకు ఉంది. రేవంత్ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు 50 లక్షల లంచం ఆశ జూపి పట్టుబడ్డారు. రేవంత్ గురివింద గింజలా మాట్లాడుతున్నారు. తీరు మారకపోతే రేవంత్‌కు నల్లగొండ ప్రజలు బుద్ధి చెబుతారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shabad Current Shock Death | కరెంట్ షాక్‌తో బాలుడు మృతి.. లైన్మెన్ నిర్లక్ష్యమే కారణమా?
జూన్ 29, 2026

Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!
జూన్ 29, 2026

Unemployed Youth Protest | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి యత్నం.. నిరుద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●Mallikarjun Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి మల్లికార్జున ఖర్గే గుర్తింపు
- ●Anjali | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన అంజలి - కారణం ఇదేనా?
- ●Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!
- ●TGSRTC | యూనియన్ ఎన్నికల దిశగా టీజీఎస్ ఆర్టీసీ కసరత్తు..
- ●Street Dog | అమానవీయ ఘటన.. కుక్కమెడకు ఇటుక కట్టి.. నదిలోకి తోసేశారు
- ●Ntr | అఫీషియల్ - ఒకే ఆయుధం...ఒకే లక్ష్యం - ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ ట్రెండింగ్

Mallikarjun Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి మల్లికార్జున ఖర్గే గుర్తింపు

Anjali | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన అంజలి - కారణం ఇదేనా?

Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!

TGSRTC | యూనియన్ ఎన్నికల దిశగా టీజీఎస్ ఆర్టీసీ కసరత్తు..



