Unemployed Youth Protest | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి యత్నం.. నిరుద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
Unemployed Youth Protest | తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని ఆరోపిస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- నిరుద్యోగులను లాక్కెళ్లిన పోలీసులు..
- కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం
- 20వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్
Unemployed Youth Protest | తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని ఆరోపిస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గద్దెనెక్కిన రెండున్నరేళ్ల అనంతరం ప్రభుత్వం కేవలం 5వేల పోలీస్ ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడంపై నిరుద్యోగుల్లో అసంతృప్తి మరింత పెరిగింది. 20వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమయంలోనే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ, ఎస్ఐ–కానిస్టేబుల్ అభ్యర్థుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
లక్షీకాపూల్ ప్రాంతంలోని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు వారిని డీజీపీ కార్యాలయం పరిసరాల్లోనే అడ్డుకున్నారు. నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పోలీస్ ఉద్యోగాల పోస్టుల సంఖ్యను 5 వేల నుంచి 20 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరుద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. కొందరిని బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల చర్యలతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి కొద్దిసేపు ఆందోళనకరంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shabad Current Shock Death | కరెంట్ షాక్తో బాలుడు మృతి.. లైన్మెన్ నిర్లక్ష్యమే కారణమా?
జూన్ 29, 2026

Diseased Chicken Shadnagar | షాద్నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!
జూన్ 29, 2026

TGSRTC | యూనియన్ ఎన్నికల దిశగా టీజీఎస్ ఆర్టీసీ కసరత్తు..
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●Shabad Current Shock Death | కరెంట్ షాక్తో బాలుడు మృతి.. లైన్మెన్ నిర్లక్ష్యమే కారణమా?
- ●Mallikarjun Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి మల్లికార్జున ఖర్గే గుర్తింపు
- ●Anjali | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన అంజలి - కారణం ఇదేనా?
- ●Diseased Chicken Shadnagar | షాద్నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!
- ●TGSRTC | యూనియన్ ఎన్నికల దిశగా టీజీఎస్ ఆర్టీసీ కసరత్తు..
- ●Street Dog | అమానవీయ ఘటన.. కుక్కమెడకు ఇటుక కట్టి.. నదిలోకి తోసేశారు

Shabad Current Shock Death | కరెంట్ షాక్తో బాలుడు మృతి.. లైన్మెన్ నిర్లక్ష్యమే కారణమా?

Mallikarjun Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి మల్లికార్జున ఖర్గే గుర్తింపు

Anjali | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన అంజలి - కారణం ఇదేనా?

Diseased Chicken Shadnagar | షాద్నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!



