త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | కేటీఆర్ చెప్పిందే నిజ‌మైంది.. కానీ కేంద్ర మంత్రులు ఆయ‌న్ని ఎగ‌తాళి చేసిండ్రు

Manne Krishank | ప్రభుత్వాలు యువతకు సమాధానం చెప్పకపోతే నేటి పరిస్థితులు వస్తాయని కేటీఆర్ ఆనాడు చెప్పిందే నిజ‌మైంద‌ని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. కానీ కొంద‌రు కేంద్ర‌మంత్రులు ఎగ‌తాళి చేశార‌ని మండిప‌డ్డారు. నేడు ఏం జరుగుతుందో దేశం మొత్తం చూస్తుందన్నారు.

S

Telangana | Published On Jul 25, 2026, 1.54 pm IST

Manne Krishank | కేటీఆర్ చెప్పిందే నిజ‌మైంది.. కానీ కేంద్ర మంత్రులు ఆయ‌న్ని ఎగ‌తాళి చేసిండ్రు
Advertisement
  • ప్రభుత్వాలు యువతకు సమాధానం చెప్పకుంటే ఇలాంటి ప‌రిస్థితులే వస్తయని కేటీఆర్ చెప్పిండు
  • సమస్యకు పరిష్కారం చూప‌కుండా బీజేపోళ్లు డైవర్ట్ చేస్తున్నరు
  • రాహుల్ కోసం మూడు రంగుల జెండా ప‌ట్టి పాట‌తో రేవంత్ ర్యాలీ తీసిండు..
  • అది నీట్ ప‌రీక్ష లీక్ కోస‌మైతే కాదు
  • కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఫైర్‌

Manne Krishank | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రభుత్వాలు యువతకు సమాధానం చెప్పకపోతే నేటి పరిస్థితులు వస్తాయని కేటీఆర్ ఆనాడు చెప్పిందే నిజ‌మైంద‌ని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. కానీ కొంద‌రు కేంద్ర‌మంత్రులు ఎగ‌తాళి చేశార‌ని మండిప‌డ్డారు. నేడు ఏం జరుగుతుందో దేశం మొత్తం చూస్తుందన్నారు. సమస్యకు పరిష్కారం చూపకుండా బీజేపీ నాయకులు డైవర్ట్ చేస్తున్నారని విమ‌ర్శించారు. రాహుల్ గాంధీ కోసం కొడంగల్‌లో మూడు రంగుల జెండా ప‌ట్టి పాట‌తో రేవంత్ రెడ్డి ర్యాలీ తీశార‌ని.. అది నీట్ పరీక్ష లీక్ కోస‌మైతే కాద‌న్నారు. ఈ మేర‌కు ఆయ‌న శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

దేశ వ్యాప్తంగా యూత్ మూమెంట్‌ను ఈరోజు మనమందరం చూస్తున్నాం. ఢిల్లీ నుంచి మొదలై అన్ని నగరాల్లో యువత రోడ్లపైకి వస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు బాధ్యుడైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. నేడు ఏం జరుగుతుందో దేశం మొత్తం చూస్తుంది. కేటీఆర్ చెప్పింది నిజ‌మైంది. సమస్యకు పరిష్కారం చూపకుండా బీజేపోళ్లు డైవర్ట్ చేస్తున్నారు.

యువతకు మద్దతుగా కేటీఆర్ ర్యాలీ చేస్తే కాంగ్రెస్, బీజేపీ టార్గెట్ చేస్తుంది. బండి సంజయ్, కాంగ్రెస్ నాయకులు తల తోక లేకుండా కేటీఆర్‌పై మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏం జరిగినా దానికి కేటీఆర్ బాధ్యుడని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అంటున్నారు. కేటీఆర్ విద్యా రంగంలో సంస్కరణల కోసం మాట్లాడుతుంటే కొందరు రాజకీయాలు చేస్తున్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి మంచి మిత్రులు అనడానికి పోక్సో కేసులో ఏం జరిగిందో చూశాం అని క్రిశాంక్ విమ‌ర్శించారు.

గ్లోబ‌రినా సంస్థ‌పై విచార‌ణ చేయ‌మ‌నండి..

బండి సంజయ్, రేవంత్ రెడ్డి గ్లోబరినా సంస్థపై నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. గ్లోబరినా కేటీఆర్ సంస్థ అయితే 2013లో JNTU గ్లోబరినా సంస్థకు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? ఆనాడు VSN రాజు గ్లోబరినా CEOగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబరినా సంస్థకు అనేక అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు కాళోజీ యూనివర్సిటీ వెబ్ సైట్ నడిపిస్తుంది పేరు మార్చుకున్న గ్లోబరినానే. గ్లోబరినా సంస్థ కేటీఆర్‌ది అని ఆరోపణ చేసిందే కాంగ్రెస్. సిట్ దర్యాప్తుతో విచారణ చెయ్యమనండి అని క్రిశాంక్ సూచించారు.

నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని కాంగ్రెస్, బీజేపీ డైవర్ట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇద్దరు ఎమ్మెల్సీలకు మినిస్టిరీ ఆఫ్ కేటీఆర్ ఇచ్చారు.. వారి పని పొద్దున లేస్తే కేటీఆర్‌పై ప్రెస్ మీట్‌ పెట్టడమే. పేపర్ లీక్ కాకుండా కఠినమైన చట్టాలు తేవాలని యువత అంటుంటే.. ప్రశ్నిస్తున్న వారిని దేశ ద్రోహులని అంటున్నారు అని మ‌న్నె క్రిశాంక్ మండిప‌డ్డారు.

 

Advertisement
Advertisement