త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu Bharosa | రైతు భ‌రోసా నిధులు ప‌క్క‌దారి.. ఏఈవోపై వేటు

Rythu Bharosa | అన్న‌దాత‌ల‌కు సాయంగా పంట పెట్టుబ‌డి కోసం (Rythu Bharosa) ప్ర‌భుత్వం ఇస్తున్న నిధుల‌ను ఓ అధికారిని ప‌క్క‌దారి ప‌ట్టించింది. ఓ రైతుకు సంబంధించిన డ‌బ్బును త‌న ఖాతాకు మ‌ళ్లించుకుంది.

G

Telangana | Published On Jul 25, 2026, 12.32 pm IST

Rythu Bharosa | రైతు భ‌రోసా నిధులు ప‌క్క‌దారి.. ఏఈవోపై వేటు
Advertisement

Rythu Bharosa | త్రినేత్ర‌.న్యూస్‌: అన్న‌దాత‌ల‌కు సాయంగా పంట పెట్టుబ‌డి కోసం (Rythu Bharosa) ప్ర‌భుత్వం ఇస్తున్న నిధుల‌ను ఓ అధికారిని ప‌క్క‌దారి ప‌ట్టించింది. ఓ రైతుకు సంబంధించిన డ‌బ్బును త‌న ఖాతాకు మ‌ళ్లించుకుంది. ల‌బ్దిదారుల జాబితాలో ఆ రైతు పేరు ఉన్న‌ప్ప‌టికీ.. డ‌బ్బులు మాత్రం త‌న‌కు రావ‌డం లేదంటూ ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

కామారెడ్డి (Kamareddy) జిల్లా రాజంపేట మండ‌లం షేర్ శంక‌ర్ తండాకు చెందిన కాట్రోత్ కిష‌న్ అనే రైతుకు ఎక‌రం రెండు గుంట‌ల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన రైతు భ‌రోసా నిధులు (Rythu Bharosa Funds) గ‌త కొన్నేండ్లుగా రైతు అకౌంట్‌లో జ‌మ‌కావ‌డం లేదు. కానీ ల‌బ్ధిదారుల జాబితాలో మాత్రం ఆయ‌న పేరు ఉంటున్న‌ది. ఆరా తీసిన బాధిత రైతు.. మరొక‌రి బ్యాంకు ఖాతాలోకి డ‌బ్బు మ‌ల్లుతున్న‌ట్లు గుర్తించారు. దీంతో జిల్లా ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశారు. విచార‌ణ చేప‌ట్టిన అధికారులు.. ఏఈఓ (AEO) మౌనిక అకౌంట్‌లో రూ.90 వేలు జ‌మైన‌ట్లుగా గుర్తించారు. ఈ నేప‌థ్యంలో ఆమెను సస్పెండ్ చేశారు.

 

Advertisement
Advertisement