BC Study Circle | పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారా?.. ఉచిత కోచింగ్, ప్రతి నెల స్టైపెండ్ కూడా.. ఎక్కడంటే?
BC Study Circle | మీరు సర్కారు కొలువుల కోసం సన్నద్ధమవుతున్నారా?.. కోచింగ్ కోసం చూస్తున్నారా?.. అయితే మీకు గుడ్‌న్యూస్. ఉచితంగా కోచింగ్ (Free Coaching) అందించడంతోపాటు ప్రతినెల స్టైపెండ్ కూడా అందించనుంది ప్రభుత్వం.
BC Study Circle | త్రినేత్ర.న్యూస్: మీరు సర్కారు కొలువుల కోసం సన్నద్ధమవుతున్నారా?.. కోచింగ్ కోసం చూస్తున్నారా?.. అయితే మీకు గుడ్‌న్యూస్. ఉచితంగా కోచింగ్ (Free Coaching) అందించడంతోపాటు ప్రతినెల స్టైపెండ్ కూడా అందించనుంది ప్రభుత్వం. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణా కేంద్రం (TGBCESDTC) రాష్ట్రంలోని 12 టీజీ బీసీ స్టడీ సర్కిళ్లలో (BC Study Circle) బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ఉచిత ఫౌండేషన్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్-I, గ్రూప్-II, గ్రూప్-III, గ్రూప్-IV, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB), పోలీస్ నియామక పరీక్షలకు శిక్షణ అందిస్తున్నది. ఆసక్తి, అర్హత కలగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
ప్రతినెల స్టైపెంట్ కూడా..
ఈ కోచింగ్ కార్యక్రమం 125 రోజుల పాటు ఉంటుంది. అంటే సుమారు ఐదు నెలలు అన్నట. ఈ సమయంలో ప్రభుత్వం నెలకు రూ.1000 చొప్పున స్టైపెండ్ అందిస్తుంది. ఈ మొత్తాన్ని అభ్యర్థులు పుస్తకాలు కొనుక్కోవడానికి, బస్‌పాస్ ఖర్చుల కోసం ఇవ్వనుంది. అయితే దీనికోసం ప్రతినెల 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ హాజరు తప్పనిసరి.
అర్హతలు..
అభ్యర్థి తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణుడై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం (2026–27 ఆర్థిక సంవత్సరానికి) గ్రామీణ ప్రాంతాలలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ.2.00 లక్షలు మించకూడదు. రెగ్యులర్ కోర్సు చదువుతున్న వారు, ఉద్యోగంలో ఉన్న వారు మరియు గతంలో టీజీ బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్ పొందిన వారు అర్హులు కారు.
ఎంపిక
డిగ్రీలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనలు మరియు ఆయా స్టడీ సర్కిళ్లలో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తులు: జూలై 25 నుంచి
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 14
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: ఆగస్టు 18
ధ్రువపత్రాల పరిశీలన: ఆగస్టు 20 నుండి 24 వరకు
కోచింగ్ ప్రారంభం: ఆగస్టు 25
వెబ్‌సైట్: http://tgbcstudycircle.cgg.gov.in
- అభ్యర్ధులు సందేహాలు లేదా సాంకేతిక సాయం కోసం సైదాబాద్‌లోని ప్రధాన కార్యాలయాన్ని నేరుగా గానీ లేదా ఫోన్ 040-24071178, 7780359322 ద్వారా గానీ సంప్రదించవచ్చు.
అడ్రస్:
టీజీ బీసీ స్టడీ సర్కిల్, రోడ్ నం.8, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్- 500059
తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణా కేంద్రం (TGBCESDTC), హైదరాబాద్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 టీజీ బీసీ స్టడీ సర్కిళ్లలో నిర్వహించే గ్రూప్-I, గ్రూప్-II, గ్రూప్-III, గ్రూప్-IV, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్…
— Ponnam Prabhakar (@Ponnam_INC) July 25, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponnam PRabhakar | రోజుకు 12 వేల వాటర్ ట్యాంకర్ల డిమాండ్.. ఇదీ హైదరాబాద్ పరిస్థితి
- ●Dharmendra Pradhan Resignation | "ఇది దేశ యువత విజయం.. అహంకారంపై సాధించిన గెలుపు": ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్
- ●Dasoju Sravan Kumar | జ్ఞాన సమాజం రోడ్డెక్కితే.. ఎంతటి అహంకారమైనా మోకరిల్లాల్సిందే
- ●CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్‌మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్‌కూ లింకులు: ఢిల్లీ పోలీసులు
- ●iQOO Z11 Lite | ఐక్యూ జడ్11 లైట్ 5జి వచ్చేసింది.. 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో..
- ●Harish Rao | యువతకు ఇది ఒక గొప్ప విజయం.. నిజంగానే దేశంలో మార్పు : హరీశ్‌రావు

Ponnam PRabhakar | రోజుకు 12 వేల వాటర్ ట్యాంకర్ల డిమాండ్.. ఇదీ హైదరాబాద్ పరిస్థితి

Dharmendra Pradhan Resignation | "ఇది దేశ యువత విజయం.. అహంకారంపై సాధించిన గెలుపు": ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్

Dasoju Sravan Kumar | జ్ఞాన సమాజం రోడ్డెక్కితే.. ఎంతటి అహంకారమైనా మోకరిల్లాల్సిందే

CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్‌మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్‌కూ లింకులు: ఢిల్లీ పోలీసులు




