BJP Ramchandar Rao | ఇకనుంచి ఏ పరీక్ష పేపర్ లీకైనా 10 ఏండ్ల జైలు.. 15 కోట్ల ఫైను
BJP Ramchandar Rao | ఇక నుంచి ఏ పరీక్ష పైపర్ లీకైనా 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.15 కోట్ల ఫైన్ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. 2024 చట్టానికి పార్లమెంటులో సవరణ చేయబోతున్నారని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
- పార్లమెంటులో చట్టం చేయబోతున్నరు
- ఫాస్ట్‌ట్రాక్ కోర్టుతో నాలుగు నెలల్లోనే శిక్ష పడుతుంది
- మోదీ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతున్నా
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
BJP Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: ఇక నుంచి ఏ పరీక్ష పైపర్ లీకైనా 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.15 కోట్ల ఫైన్ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. 2024 చట్టానికి పార్లమెంటులో సవరణ చేయబోతున్నారని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ యువత కూడా దీన్ని స్వాగతిస్తుందని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈమేరకు శనివారం ఆయన నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు.
రాధాకృష్ణన్ కమిటీ రెకమెండేషన్ మీద ఎన్‌టీఏ పెట్టి అందులో చాలా మంది అధికారులను పెట్టడం జరిగింది. ఆ అధికారుల నిర్లక్ష్యం వల్ల లేదా ఇంకేదో కారణం వల్ల అయితే దాదాపు 45 మంది అధికారులను ఎన్‌టీఏ నుంచి బదిలీ చేయడం జరిగింది.
ఇప్పుడు ఈ 2024 చట్టం ఏదైతే ఉందో దీన్ని పార్లమెంట్‌లో సవరణ చేయబోతా ఉన్నరు. ఈ సవరణ ప్రకారం ఏ పేపర్ లీకైనా వారిపై కఠిన చర్యలు ఉంటాయి. నీట్ పరీక్షనే కాకుండా యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షలు, ఆర్ఆర్‌బీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్స్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి ఏ పరీక్ష పేపరైనా సరే లీకైతే దానికి చట్టం ప్రకారం 10 సంవత్సరాల శిక్ష తప్పదు. అదేవిధంగా రూ.15 కోట్ల దాకా ఫైన్ ఉంటుంది. ఇంతకుముందు రూ.కోటి ఫైన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు రూ.15 కోట్ల వరకు ఫైన్ అవుతుంది.
దీంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమించడం. ఈ కోర్టు ద్వారా నాలుగు నెలల్లోనే కేసు దర్యాప్తు చేసి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి మోదీ ఈ నిర్ణయం తీసుకున్న సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. స్వాగతం పలుకుతున్నా. నిన్న మొన్న జరిగిన పరిణామాల్లో కూడా ఫస్ట్‌టైమ్ ప్రభుత్వం ఎవరైతే సమ్మె చేస్తున్నరో, ఆందోళనలు చేస్తున్నరో వాళ్లతోటి కూర్చొని మాట్లాడడం, చర్చలు జరపడం, తర్వాత ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావడం వంటివి జరిగినయ్ అని బీజేపీ చీఫ్ వివరించారు.
ఇటీవల ఘటనలు ఎందుకు జరినయో, ఏం జరిగిందో దాని మీద నేన్ మాట్లాడను. కానీ ఈ పెద్ద నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందుకు బీజేపీ తెలంగాణ తరఫు నుంచి మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నా. మన రాష్ట్ర యువత కూడా మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తుందని నేను కోరుతున్నా అని రాంచందర్‌రావు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్
- ●IND Vs JPN | పోరాడి ఓడిన జపాన్.. రెండు పరుగుల తేడాతో భారత్ విన్.. వైడ్ నిర్ణయంపై హాట్ టాపిక్..!
- ●Heavy Rains | రంగు మారిన నింగి.. ట్యాంక్‌బండ్ నుంచి హైటెక్ సిటీ వరకు జోరు వాన
- ●Tamannaah | వివాదంలో తమన్నా బాలీవుడ్ మూవీ - తన పాటను దొంగిలించారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపణ
- ●Airtel | ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో అదిరిపోయే బెనిఫిట్స్.. యాపిల్ నుంచి ఇవన్నీ ఉచితమే..
- ●Jagadeesh Reddy | వందల ఎకరాలు ఏడున్నయో రాధాకృష్ణ చెప్తే అమ్ముకుంటా

Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్

IND Vs JPN | పోరాడి ఓడిన జపాన్.. రెండు పరుగుల తేడాతో భారత్ విన్.. వైడ్ నిర్ణయంపై హాట్ టాపిక్..!

Heavy Rains | రంగు మారిన నింగి.. ట్యాంక్‌బండ్ నుంచి హైటెక్ సిటీ వరకు జోరు వాన

Tamannaah | వివాదంలో తమన్నా బాలీవుడ్ మూవీ - తన పాటను దొంగిలించారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపణ





