Students Protest | విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలిపితే డబ్బులు ఇస్తామన్నారు.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్!
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనలపై బిగ్‌బాస్ బ్యూటీ ఆకాంక్ష పూరి సంచలన వ్యాఖ్యలు చేసింది. కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలిపితే తనకు భారీగా డబ్బులు ఇస్తామన్నారని చెప్పింది.
Entertainment | Published On Jul 25, 2026, 1.13 pm IST
Students Protest | నీట్ పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు. విద్యార్ధుల దీక్షకు పలువురు సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు.
కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, జ్యోతిక, రితేష్ దేశ్‌ముఖ్, అలియాభట్‌తో సహా పలువురు ప్రముఖులు ఈ పోరాటానికి సంఘీభావం తెలిపారు. ప్రకాష్ రాజ్, హ్యుమా ఖురేషి, షబానా ఆజ్మీతో పాటు మరికొందరు సెలిబ్రిటీలు నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
డబ్బులు ఇస్తామన్నారు....
విద్యార్థుల నిరసనలపై బిగ్‌బాస్ బ్యూటీ, బాలీవుడ్ నటి ఆకాంక్ష పూరి సంచలన వ్యాఖ్యలు చేసింది. కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలిపితే తనకు భారీగా డబ్బులు ఇస్తామని కొందరు ఆఫర్ చేశారని అన్నది. "జంతర్ మంతర్ వెళ్లడానికి ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఈ నిరసనలపై రీల్స్, పోస్ట్‌లు పెట్టమని అడిగారు. వాటి కోసం కూడా డబ్బులు అరెంజ్ చేస్తామన్నారు. నాలాగే చాలా మంది క్రియేటర్లకు ఇలాంటి ఆఫర్లు వచ్చాయి. కొందరు డబ్బులకు ఆశపడి అంగీకరిస్తున్నారు. నేను మాత్రం ఒప్పుకోలేదు. నా స్వార్థం చూసుకోకుండా విద్యార్థుల పోరాటానికి నిజాయితీగా మద్దతు తెలిపాలని అనుకున్నా" అంటూ ఆకాంక్షపూరి కామెంట్లు చేసింది. ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతోన్నాయి.
సీఐడీ సీరియల్‌తో
సీఐడీ సీరియల్‌తో ఆకాంక్ష పూరి యాక్టింగ్ జర్నీ మొదలైంది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 15తో పాటు బిగ్‌బాస్ ఓటీటీలో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది. దక్షిణాదితో పాటు హిందీలో కొన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది. తమిళంలో అలెక్స్ పాండియన్, యాక్షన్, మలయాళంలో సామ్రాజ్యం, అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలు ఆకాంక్ష పూరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
తాజావార్తలు
- ●Medical Student | ఐదో అంతస్తు నుంచి దూకి.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..
- ●Windows 11 | మీ విండోస్ ల్యాప్ టాప్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావడం లేదా.. ఈ సెట్టింగ్స్‌ను మార్చండి..
- ●Rythu Bharosa | రైతు భరోసా నిధులు పక్కదారి.. ఏఈవోపై వేటు
- ●Post Office RD | పోస్టాఫీస్ అందిస్తున్న బెస్ట్ స్కీం.. రూ.16 లక్షలు పొందండిలా..
- ●Sobhita Dhulipala | భార్య వంటపై నాగచైతన్య ఫన్నీ ఫోస్ట్ - శోభిత క్యూట్ రిప్లై
- ●CJP | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.. అప్పుడే కేంద్రంతో చర్చలు: సీజేపీ

Medical Student | ఐదో అంతస్తు నుంచి దూకి.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

Windows 11 | మీ విండోస్ ల్యాప్ టాప్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావడం లేదా.. ఈ సెట్టింగ్స్‌ను మార్చండి..

Rythu Bharosa | రైతు భరోసా నిధులు పక్కదారి.. ఏఈవోపై వేటు

Post Office RD | పోస్టాఫీస్ అందిస్తున్న బెస్ట్ స్కీం.. రూ.16 లక్షలు పొందండిలా..



