Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?
Chirumalla Rakhesh Kumar | ఉస్మానియాకు వెయ్యి కోట్లు, చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.500 కోట్లు ఏమయ్యాయని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమళ్ల రాకేశ్ కుమార్ నిలదీశారు.
- యూనివర్సిటీలకు పేర్లు పెట్టడం తప్పా ఐదు పైసలు కూడా ఇవ్వలే
- వెంటనే నిధులివ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
- కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమళ్ల రాకేశ్ కుమార్ హెచ్చరిక
Chirumalla Rakhesh Kumar | త్రినేత్ర న్యూస్: ఉస్మానియాకు వెయ్యి కోట్లు, చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.500 కోట్లు ఏమయ్యాయని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమళ్ల రాకేశ్ కుమార్ నిలదీశారు. రేవంత్ రెడ్డి యూనివర్సిటీలకు పేర్లు పెట్టడం తప్ప రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల తరహాలో ఓయూ ఏమవుతుందో అనే భయం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఓయూ అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్లు ఇస్తామని 2025, డిసెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి 500 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కానీ ఐదు పైసలు కూడా ఇవ్వకుండా కాగితాలు చేతిలో పెడితే ఎలా? ఓయూ విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం 200 కోట్లు కూడా ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి యూనివర్సిటీలకు పేర్లు పెట్టడం తప్ప చేసిందేమీ లేదు.
ఫీజ్ రీఎంబర్స్ మెంట్, మెస్ బకాయిలు కూడా రావడం లేదు. ఎఫ్‌డీల వడ్డీలతో జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి. లేదంటే బీఆర్ఎస్, విద్యార్థి విభాగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని రాకేశ్ కుమార్ హెచ్చరించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!
- ●Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ
- ●Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?
- ●OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..
- ●Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే
- ●Telangana Congress | గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. రెండు సీట్లైనా బీసీలకు ఇవ్వండి

Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!

Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ

Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?

OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..





