త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kummera Incident | కుమ్మెరలో ఏం జ‌రిగిందంటే..? పోలీసుల కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

Kummera Incident | కుమ్మెర మ‌ల్ల‌న్న స్వామి జాత‌ర సంద‌ర్భంగా ఓ రెండు నెల‌ల ప‌సికందును అగ్ర కులాల‌కు చెందిన కొంత‌మంది నేత‌లు కాలితో త‌న్ని చంపార‌న్న వార్త‌లు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా పోలీసు శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

S

Telangana | Published On Feb 24, 2026, 4.26 pm IST

Kummera Incident | కుమ్మెరలో ఏం జ‌రిగిందంటే..? పోలీసుల కీల‌క ప్ర‌క‌ట‌న‌..!
Advertisement

Kummera Incident | త్రినేత్ర‌.న్యూస్ : కుమ్మెర మ‌ల్ల‌న్న స్వామి జాత‌ర సంద‌ర్భంగా ఓ రెండు నెల‌ల ప‌సికందును అగ్ర కులాల‌కు చెందిన కొంత‌మంది నేత‌లు కాలితో త‌న్ని చంపార‌న్న వార్త‌లు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌సికందు మృతికి కార‌ణ‌మైన వారిపై కేసులు న‌మోదు చేయాల‌ని, క‌ఠినంగా శిక్షించాల‌ని ఆయా రాజ‌కీయ పార్టీల నేత‌లు, ప్ర‌జా సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్న విష‌యం విదిత‌మే. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కు నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా పోలీసు శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కుమ్మెర జాత‌ర ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను సంక్షిప్తంగా వెల్ల‌డించింది.

ఫిబ్ర‌వ‌రి 18, 2026

  • ఈ నెల 18న రాత్రి సుమారు 8.30 గంట‌ల స‌మ‌యంలో.. కుమ్మెర గ్రామానికి చెందిన ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి(42) ఆల‌యం వ‌ద్ద క్యూలైన్‌ను నిర్వ‌హిస్తున్నారు. అదే స‌మ‌యంలో అదే గ్రామానికి చెందిన చిలికేశ్వ‌రం చంద్ర‌క‌ళ అలియాస్ చాక‌లి క‌ర్రెమ్మ‌, బౌర‌మ్మ క్యూను దాటేందుకు ప్ర‌య‌త్నించారు. వారిద్ద‌రిని శ్రీనివాస్ రెడ్డి ప్ర‌శ్నించ‌గా.. అమ‌ర్యాద‌గా, అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అనంత‌రం.. చిలికేశ్వ‌రం గ‌ణేశ్‌(బౌర‌మ్మ మేన‌ల్లుడు) శ్రీనివాస్ రెడ్డిపై దూషణ‌ల‌తో కూడిన ఆడియో క్లిప్‌ను గ్రామ వాట్సాప్ గ్రూపులో ప్రచారం అయినట్లు పేర్కొన్నారు. తర్వాత గణేష్‌ను ప్రశ్నించిన సమయంలో రాయితో దాడి చేసి తలకు గాయపరిచినట్లు, గణేష్‌తో పాటు అతని బంధువులు ఆశీర్వాదం, కీర్తి కలిసి శ్రీనివాస్ రెడ్డి, మధ్యవర్తి సంగం విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేర‌కు ప‌లు సెక్ష‌న్ల కింద నాగ‌ర్‌క‌ర్నూల్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
  • అదే రోజు రాత్రి సుమారు 9.30 గంటలకు శ్రీనివాస్ రెడ్డి, మరికొంతమంది (శ్రీను, ఎస్ మధు, సతీష్ రెడ్డి, పవన్, కన్నీ, శ్రీకాంత్ రెడ్డి, నరేష్) తమ కుటుంబ సభ్యులపై దాడి చేసి దూషించారని చిలికేశ్వ‌రం గ‌ణేశ్‌ ఫిర్యాదు చేశారు. మొదట జనరల్ డైరీలో నాన్ కాగ్నిజబుల్‌గా నమోదు చేసి, కోర్టు అనుమతి అనంతరం ప‌లు సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఫిబ్ర‌వ‌రి 21న శిశువు మృతి

  • ఈ నెల 21న ఉద‌యం 6 గంట‌ల‌కు చిలికేశ్వ‌రం మౌనిక (గణేష్ భార్య) తమ రెండు నెలల పాప స్పందించకుండా ఉండటంతో నాగర్‌క‌ర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం షార్ట్ ఒపీనియన్ ప్రకారం శరీరంపై ఎటువంటి బాహ్య లేదా అంతర్గత యాంటీమార్టం గాయాలు కనిపించలేదు. తుది మరణ కారణం FSL హిస్టోపాథాలజీ నివేదిక అనంతరం వెల్లడించబడుతుంది అని పోలీసులు పేర్కొన్నారు.

అదనపు ఆరోపణలు.. కొత్త కేసు నమోదు

  • ఈ నెల 22న మౌనిక మ‌రిన్ని ఆరోప‌ణ‌లు చేసింది. 18వ తేదీన జ‌రిగిన గొడ‌వ సంద‌ర్భంగా.. శ్రీనివాస్ రెడ్డి, గ్రామ స‌ర్పంచ్ తుకారం రెడ్డి త‌దిత‌రులు గణేష్‌ను ఒక గదిలో బంధించి ఇనుప రాడ్లు, కొబ్బరికాయలతో దాడి చేశారని, ఆ సమయంలో జరిగిన తోపులాటలో సంగం మధు రెడ్డి తన శిశువును తన్నడంతో ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు ఆరోపించారు. ఈ మేర‌కు మ‌రో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఫిబ్ర‌వ‌రి 23న అరెస్టు అయింది వీరే..

  • A1 శ్రీనివాస్ రెడ్డి
  • A2 మధుసూదన్ రెడ్డి
  • A3 శ్రీకాంత్ రెడ్డి
  • ఈ ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా న్యాయ హిరాస‌త్‌కు పంపించారు.

మిగతా నిందితులు వీరే..

  • A4 విష్ణువర్ధన్ రెడ్డి
  • A5 కన్నీ రెడ్డి
  • A6 కటికె నరేష్
  • A7 తుకారం రెడ్డి
  • A8 సతీష్ రెడ్డి
  • A9 మాధవ్ రెడ్డి
  • ఈ ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ప్ర‌త్యేక బృందాలు గాలిస్తున్నాయి.

కుల వివరాలు

  • ఫిర్యాదుదారు మౌనిక కుల వివరాలు అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ విషయంలో ఎమ్మార్వో కార్యాలయానికి నివేదన పంపించబడింది. సంబంధిత శాఖ నివేదిక కోసం వేచి చూస్తున్నారు.

ఉన్నతాధికారుల పరిశీలన

  • జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, డీఎస్పీ శ్రీనివాస్ కుమ్మెర గ్రామాన్ని సందర్శించి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.. చ‌ట్ట ప్ర‌కారం త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోబ‌డుతాయ‌ని జిల్లా పోలీసు శాఖ వెల్ల‌డించింది.
Advertisement

తాజావార్తలు

Advertisement