త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aishwarya Death Case | మెడికవర్ ఆసుపత్రిని తగలబెడ్తం.. అది మూత ప‌డాల్సిందే

Aishwarya Death Case | మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రిని త‌గ‌ల‌బెడ్తామ‌ని.. అది క‌చ్చితంగా మూత ప‌డాల్సిందేన‌ని మృతురాలు ఐశ్వ‌ర్య స‌హ‌చ‌ర న్యాయ‌వాదులు ఫైర్ అయ్యారు. అస‌లు ఓన‌ర్ ఎవ‌రో రోడ్డు మీదికి గుంజాల‌ని ఊగిపోయారు.

S

Telangana | Published On Oct 13, 2026, 6.10 pm IST

Aishwarya Death Case | మెడికవర్ ఆసుపత్రిని తగలబెడ్తం.. అది మూత ప‌డాల్సిందే
Advertisement
  • ఇంజిక్ష‌న్ వేస్తే పోయేదానికి స‌ర్జ‌రీ అంట‌.. ఇంకా రూ.9 ల‌క్ష‌లు క‌ట్టాలట‌
  • అస‌లు స‌ర్జ‌రీయే అవ‌స‌రం లేదు.. ఆ ఓన‌ర్ ఎవ‌రో బ‌య‌టికి గుంజుతం
  • కిడ్నీలో 2mm స్టోన్ ఉంటే మనిషి ప్రాణాలు పోతయా?
  • మృతురాలు ఐశ్వర్య సహచర న్యాయ‌వాదుల‌ ఫైర్‌

Aishwarya Death Case | త్రినేత్ర న్యూస్: మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రిని త‌గ‌ల‌బెడ్తామ‌ని.. అది క‌చ్చితంగా మూత ప‌డాల్సిందేన‌ని మృతురాలు ఐశ్వ‌ర్య స‌హ‌చ‌ర న్యాయ‌వాదులు ఫైర్ అయ్యారు. అస‌లు ఓన‌ర్ ఎవ‌రో రోడ్డు మీదికి గుంజాల‌ని ఊగిపోయారు. 2MM కిడ్నీ స్టోన్‌కే ఓ మనిషి ప్రాణాలు పోతాయా? అని ప్ర‌శ్నించారు. ఇంజిక్ష‌న్ వేస్తే స‌రిపోయేదానికి స‌ర్జ‌రీ చేసి నిండు ప్రాణాల‌ను బ‌లిగొన్నార‌ని ఆరోపించారు. ఈమేర‌కు ఆమె ఆస్ప‌త్రి బ‌య‌ట మీడియాతో మాట్లాడుతూ మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రి యాజ‌మాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ప్రిట‌ర్ లేద‌ని ఫాల్తు ఆన్స‌ర్ ఇస్తున్న‌రు

అసలేం ట్రీట్‌మెంట్ ఇచ్చారో రిపోర్ట్ ఇవ్వమంటే.. ప్రింటర్ లేదని ఈ ఫాల్తు ఆస్పత్రి వాళ్లు చెప్తున్నారు. నిజానికి.. 2MM కిడ్నీ స్టోన్ కోసం ఎలాంటి సర్జరీ అవసరం లేదు. కానీ మెడికవర్ వాళ్లు ఫీజు కట్టించుకొని చేర్పించుకున్నారు, ఇంకా రూ.9 లక్షలు కట్టాలట! ప్రదీప్ మిశ్రా అనే వైద్యుడు.. మీ పాప 200 ఏళ్లు బతుకుతుందా అని హేళన చేశాడు.

సర్జరీ వల్లే ఐశ్వర్య చ‌నిపోయింది

ఐశ్వర్యకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు.. కిడ్నీలో 2MM స్టోన్ ఉందంతే. దాన్ని తొలగించడానికి రూ.3 లక్షలు కట్టించుకొని సర్జరీ చేయాలన్నారు. కానీ.. డబ్బుల కోసం ఆ అమ్మాయిని ఆసుపత్రిలో చేర్పించుకున్నారు. సర్జరీ చేసిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. కేవలం వైద్యులు చేసిన సర్జరీ వల్లే బాడీ మొత్తం పాయిజన్ అయ్యింది. సర్జరీ వల్లే ఐశ్వర్య చ‌నిపోయింది. ఇంకా ఎంతమంది ఇలా చంపుతారు?

మా న్యాయవాదులందరూ వస్తున్నారు.. ఆసుపత్రి తగలబెడతాం. సారీ చెప్తున్నాం కదా.. ఇంకేంటి అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మెడికవర్ ఆసుపత్రి ఓనర్‌ను రోడ్డుపైకి లాగాలి. అసలు చిన్న ఇంజిక్షన్ కూడా అవసరం లేని చికిత్స కోసం వచ్చిన యువతి ఎలా చనిపోతుంది? వైద్యులందరూ అనుభవం లేని వాళ్లే ఉన్నారు అని న్యాయ‌వాదులు ఫైర‌య్యారు.

Advertisement
Advertisement