త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NMMS | నవంబర్ 1న ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌ పరీక్ష

NMMS | తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్షను నవంబర్ 1 (ఆదివారం) నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెల్లడించింది.

S

Telangana | Published On Oct 13, 2026, 5.32 pm IST

NMMS | నవంబర్ 1న ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌ పరీక్ష
Advertisement

అందుబాటులో అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు

NMMS | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్షను నవంబర్ 1 (ఆదివారం) నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెల్లడించింది. ఈ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 12 నుంచి తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ http://bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఉపయోగించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం సూచించింది.

Advertisement
Advertisement