త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aishwarya | నడుచుకుంటూ హాస్పిటల్‌కు వెళ్లిన అమ్మాయి.. చనిపోయింది

Aishwarya | నాతో పాడు నడుచుకుంటూ చికిత్స కోసం హాస్పిటల్‌లో అడుగుపెట్టిన అమ్మాయి.. మరుసటి రోజే చనిపోయిందని మృతురాలి మామ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయ‌ని ఆస్ప‌త్రిలో చేరితే.. వైద్యుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల త‌మ కోడ‌లు ప్రాణాలు విడిచింద‌ని క‌న్నీరు పెట్టుకున్నాడు.

S

Hyderabad | Published On Oct 13, 2026, 5.26 pm IST

Aishwarya | నడుచుకుంటూ హాస్పిటల్‌కు వెళ్లిన అమ్మాయి.. చనిపోయింది
Advertisement

Aishwarya | త్రినేత్ర న్యూస్ : నాతో పాడు నడుచుకుంటూ చికిత్స కోసం హాస్పిటల్‌లో అడుగుపెట్టిన అమ్మాయి.. మరుసటి రోజే చనిపోయిందని మృతురాలి మామ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయ‌ని ఆస్ప‌త్రిలో చేరితే.. వైద్యుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల త‌మ కోడ‌లు ప్రాణాలు విడిచింద‌ని క‌న్నీరు పెట్టుకున్నాడు.

అస‌లేం జ‌రిగిందంటే..?

మృతురాలి మామ మాట‌ల్లోనే..

మ‌ల్కాజ్‌గిరికి చెందిన ఐశ్వ‌ర్య‌(26) మా కోడలు. ఆమెకు కిడ్నీలో స్టోన్ ఉంద‌ని ఈ నెల 6న సికింద్రాబాద్ మెడికోవ‌ర్ ఆస్ప‌త్రిలో అడ్మిట్ చేశాం. చికిత్స అయిపోగానే మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం పంపుత‌మ‌న్న‌రు. అటు నుంచి ఐసీయూకు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారంటే కొంచెం క్రిటిక‌ల్‌గా ఉంద‌న్నారు. ఏవేవో చెప్పారు.. త‌మ‌ను లోప‌లికి రానివ్వ‌లేదు.. ఇన్‌ఫెక్ష‌న్ అవుతుంద‌ని చెప్పారు. కానీ వాళ్లు బూట్ల‌తో, చెప్పుల‌తో ఐసీయూలోకి వెళ్లారు. రూ. 8 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టినం. ఇంకా క‌ట్ట‌మ‌ని అంటున్న‌రు. ఐశ్వ‌ర్య తండ్రి మ‌ల్కాజ్‌గిరి కోర్టులో లాయ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఈమెనేమో సికింద్రాబాద్ కోర్టులో లాయ‌ర్‌గా ప్రాక్టీస్ చేస్తుంది. నా వెంబ‌డి వ‌చ్చింది.. మాయ‌య్య పోతున్నా అని లోప‌లికి వెళ్లింది. ఐసీయూలోకి వెళ్లి చూస్తామ‌ని.. ఏడుస్తే కూడా పంపించ‌లేదు.. ఇన్‌ఫెక్ష‌న్ అయిత‌ద‌ని పంప‌లేదు. ఇన్సూరెన్స్ ఉంటే తీసుకురండి అని చెప్పారు. డాక్ట‌ర్లు ఏం చేయ‌లేమ‌ని చేతులెత్తేశారు. న‌డ‌చుకుంటూ పోయే పేషెంట్‌ను చంపేశారు. డాక్ట‌ర్ల‌దే వైఫ‌ల్యం. గ‌చ్చిబౌలి నుంచి డాక్ట‌ర్ రావాల‌న్నారు.. నాలుగు గంట‌లైనా రాలేదు. ట్రీట్‌మెంట్‌కు బాడీ స‌హ‌క‌రిస్త‌లేద‌ని రెండో రోజు నుంచి కౌన్సెలింగ్ ఇస్తున్న‌రు.. చేయండి స‌ర్ మీరే దేవుడు అని వేడుకున్నాం.. వాళ్లు చేసేది చేశారు. ఎవ‌రు దీనికి బాధ్యులు.. మా బాబు ఏడుస్తున్న‌డు. ఐశ్వ‌ర్య నాకు సొంత కోడ‌లు.. పెళ్లై వ‌న్ మంత్ అవుతుంద‌ని మృతురాలి మామ తెలిపాడు.

 

Advertisement
Advertisement