Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి
Jupally Krishna Rao | తెలంగాణలోకి మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తేల్చిచెప్పారు. గంజాయి, మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జూపల్లి స్పష్టం చేశారు.
Jupally Krishna Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోకి మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తేల్చిచెప్పారు. గంజాయి, మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జూపల్లి స్పష్టం చేశారు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లోని ఎక్సైజ్ అకాడమీలో నిర్వహించిన అసిస్టెంట్ సూపరింటెండెంట్స్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ల దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్) కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 117 మంది అధికారులను అభినందించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు పురస్కారాలు ప్రదానం చేశారు.

తదనంతరం జూపల్లి కృష్ణారావు ప్రసంగించారు. ఎక్సైజ్ శాఖలో మహిళల భాగస్వామ్యం పెరగడం మహిళా సాధికారతకు నిదర్శనం. 117 మందిలో 33 మంది మహిళా అధికారులు ఉన్నారు. 24 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 89 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లకు శిక్షణ అందించాం. శిక్షణతో చట్టాలపై అవగాహన, విచారణా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందాయి. అసలు పరీక్ష క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణలోనే మొదలవుతుంది. యూనిఫాం హోదాకు కాదు.. ప్రజల విశ్వాసానికి ప్రతీక. ఉద్యోగంతో పాటు సమాజం పట్ల గొప్ప బాధ్యతను అధికారులు స్వీకరిస్తున్నారు అని మంత్రి పేర్కొన్నారు.

ఎక్సైజ్ శాఖ కేవలం ఆదాయ శాఖ కాదు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక విభాగం. డ్రగ్స్, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపి యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడే బాధ్యత అధికారులపై ఉంది. తెలంగాణలోకి మాదకద్రవ్యాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. యువత భవిష్యత్తును కంటికి రెప్పలా కాపాడాలి. గంజాయి, మద్యం అక్రమ రవాణా ముఠాలపై కఠిన చర్యలు ఉంటాయి. అక్రమార్కులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని జూపల్లి హెచ్చరించారు.
నాడు నాటుసారా, గుడుంబా, కల్తీ కల్లు, సింథటిక్ డ్రగ్స్, మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లు కొత్త ముప్పుగా మారాయి. ఆన్‌లైన్ వేదికల ద్వారా జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారంపై ప్రత్యేక నిఘా అవసరం. మారుతున్న నేర ధోరణులకు అనుగుణంగా అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
సంబంధిత వార్తలు

Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే
జూన్ 11, 2026

Harish Rao | 5 వేల పోస్టులకు కాదు.. 19 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్
జూన్ 11, 2026

Madhavi Latha | తెలంగాణపై విషం చిమ్మిన మాధవీలత.. ఆజాద్ కశ్మీరీలలా ప్రవర్తిస్తున్నారంటూ కామెంట్స్
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే
- ●SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..
- ●Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ
- ●Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి
- ●Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు
- ●Bill Gates | అక్రమ సంబంధాలను అడ్డుపెట్టుకుని నాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు.. ఎప్స్టీన్పై బిల్‌గేట్స్ సంచలన ఆరోపణలు

Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే

SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..

Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ

Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి



