త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinvas Yadav | అస్తిత్వాన్ని దెబ్బ‌తీస్తామంటే ఊరుకోం: త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌

Talasani Srinvas Yadav | రెండు శ‌తాబ్దాల‌కు పైగా చ‌రిత్ర ఉన్న సికింద్రాబాద్ (Secunderabad) చ‌రిత్ర‌, అస్తిత్వం, ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీస్తామంటే చూస్తూ ఊరుకునేది లేద‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ (Talasani Srinvas Yadav) స్ప‌ష్టం చేశారు.

A

Telangana | Published On Jan 15, 2026, 4.32 pm IST

Talasani Srinvas Yadav | అస్తిత్వాన్ని దెబ్బ‌తీస్తామంటే ఊరుకోం: త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌
Advertisement

Talasani Srinvas Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: రెండు శ‌తాబ్దాల‌కు పైగా చ‌రిత్ర ఉన్న సికింద్రాబాద్ (Secunderabad) చ‌రిత్ర‌, అస్తిత్వం, ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీస్తామంటే చూస్తూ ఊరుకునేది లేద‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ (Talasani Srinvas Yadav) స్ప‌ష్టం చేశారు. సికింద్రాబాద్ ఆన‌వాళ్లు తుడిచేందుకు ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని ఆరోపించారు. కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ పార్టీ స‌మావేశానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. బ‌చావో సికింద్రాబాద్ పేరుతో ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ నుంచి నిర్వ‌హించ‌బోయే శాంతిర్యాలీ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ శాంతిర్యాలీకి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ హాజ‌ర‌వుతార‌ని చెప్పారు.

సికింద్రాబాద్ ప్రాంతంపై రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర‌లను తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు. పార్టీల‌కు అతీతంగా శాంతి ర్యాలీలో ప్ర‌జ‌లంద‌రూ పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. త‌న‌పై పెట్టిన కేసును న్యాయ‌స్థానంలోనే తేల్చుకుంటాన‌ని చెప్పారు. చ‌ట్టం అనేది అంద‌రికీ ఒకేలా వ‌ర్తించాల‌ని, ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు ఏ స్థాయిలో ఉన్నా అస‌భ్య ప‌ద‌జాలం వాడితే వారిపై కూడా కేసులు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement