Hyderabad | ఈగల్ టీమ్ శ్రమ వృథా.. 30 రోజులు గాలించి పట్టుకుంటే.. తెల్లారేసరికి నిందితుడు పరార్
Hyderabad | స్టేషన్ సిబ్బంది నిర్లాక్ష్యంతో ఈగల్ టీమ్ (EAGLE Force) శ్రమ వృథా అయ్యింది. నిషేధిత హ్యాష్ ఆయిల్ (Hash Oil) అమ్ముతున్న ముఠాను ఈగల్ టీమ్ (EAGLE Force) నెల రోజులపాటు కాపు కాసి, మెరుపుదాడులు నిర్వహించి పట్టుకుంటే.. పోలీసులకు కట్టుకథ చెప్పిన ప్రధాన నిధితుడు 5 నిమిషాల్లో తప్పించుకున్నాడు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: స్టేషన్ సిబ్బంది నిర్లాక్ష్యంతో ఈగల్ టీమ్ (EAGLE Force) శ్రమ వృథా అయ్యింది. నిషేధిత హ్యాష్ ఆయిల్ (Hash Oil) అమ్ముతున్న ముఠాను ఈగల్ టీమ్ (EAGLE Force) నెల రోజులపాటు కాపు కాసి, మెరుపుదాడులు నిర్వహించి పట్టుకుంటే.. పోలీసులకు కట్టుకథ చెప్పిన ప్రధాన నిధితుడు 5 నిమిషాల్లో తప్పించుకున్నాడు.
హైదరాబాద్‌లోని (Hyderabad) అత్తాపూర్‌కు చెందిన సయ్యద్ ముజఫర్ అలీ (28) గంజాయికి అలవాటుపడ్డాడు. సొంతంగా హ్యాష్ ఆయిల్ అమ్మడం ప్రారంభించాడు. ఒకసారి జైలుకు వెళ్లొచ్చినా దందా మాత్రం ఆపలేదు. ఇటీవల కొందరు మత్తు పదార్థాల వినియోగదారుల్ని పట్టుకోగా.. ముజఫర్ అలీ వాటిని సరఫరా చేసినట్లు గుర్తించారు. దాదాపు 30 రోజులుగా నిందితుడి కదలికలపై నిఘాపెట్టిన ఈగల్ టీమ్ మంగళవారం ఆకస్మికంగా దాడి చేసి నిందితుణ్ని అదుపులోకి తీసుకుంది. అతనివద్ద 940 గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకుంది. అనంతరం అతడిని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. బుధవారం రిమాండ్‌కు తరలించాల్సి ఉంది.
అయితే ఠాణాలో ఉంచిన గది శౌచాలయంలో వెంటిలేటర్ మరమ్మతుకు గురైనట్లు నిందితుడు గుర్తించాడు. తొలుత కడుపునొప్పి వస్తోందని సిబ్బంది ముందు నటిస్తూ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని కోరాడు. పోలీసులు నిజమేనని నమ్మి మూత్ర విసర్జన కోసమంటూ శౌచాలయంలోకి వెళ్లాడు. వెంటిలేటర్‌కు అద్దాలు లేకపోవడంతో దాని గుండా బయటకు దూకాడు. స్టేషన్ వెనుక.. మూసీ నది వైపు ఉన్న ప్రహరీని ఎక్కి అవతలకు దూకి పరారయ్యాడు. స్టేషన్ సిబ్బంది తేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. కస్టడీలో ఉన్న వ్యక్తి తప్పించుకోవడాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కాగా, నిందితుడు ఓ క్యాబ్‌లో అత్తాపూర్ సమీపంలోని లెనిన్‌నగర్ వరకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు డ్రగ్స్ వ్యాపారంలో భాగస్వాములైన నిందితుడి తల్లి రహిమున్నిసా, సోదరుడు సయ్యద్ మహ్మద్ మదర్ అలీలను పోలీసులు అరెస్టు చేశారు.
తాజావార్తలు
- ●Bank of India Recruitment | బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు.. 779 ఖాళీలతో నోటిఫికేషన్
- ●IBPS | 6715 పోస్టులతో IBPS ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్..
- ●Belgium Vs Senegal | చెదిరిన సెనెగల్ కల
- ●Tiger Reserve Zones | తెలంగాణలో పులుల సంతానోత్పత్తి..! జనసంచారంపై నిషేధం..!!
- ●England vs DR Congo | హ్యారీ కేన్ మెరుపులు.. ప్రీక్వార్టర్స్‌కు ఇంగ్లండ్
- ●Rain Alert | రాగల 48 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాలు..!

Bank of India Recruitment | బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు.. 779 ఖాళీలతో నోటిఫికేషన్

IBPS | 6715 పోస్టులతో IBPS ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్..

Belgium Vs Senegal | చెదిరిన సెనెగల్ కల

Tiger Reserve Zones | తెలంగాణలో పులుల సంతానోత్పత్తి..! జనసంచారంపై నిషేధం..!!






