త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | అధిక వ‌డ్డీ ఆశ‌జూపి.. రూ. 50 కోట్ల‌తో భార్యాభ‌ర్త‌లు ప‌రార్

Hyderabad | హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్యాపార‌వేత్త అధిక వ‌డ్డీ ఆశ‌జూపి రూ. 50 కోట్ల‌తో ప‌రారీ అయ్యాడు. మోస‌పోయామ‌ని గ్ర‌హించిన బాధితులు మ‌ల్కాజ్‌గిరి సీపీ సుమ‌తికి బాధితులు ఫిర్యాదు చేశారు.

S

Hyderabad | Published On Jul 1, 2026, 7.10 pm IST

Hyderabad | అధిక వ‌డ్డీ ఆశ‌జూపి.. రూ. 50 కోట్ల‌తో భార్యాభ‌ర్త‌లు ప‌రార్
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్యాపార‌వేత్త అధిక వ‌డ్డీ ఆశ‌జూపి రూ. 50 కోట్ల‌తో ప‌రారీ అయ్యాడు. మోస‌పోయామ‌ని గ్ర‌హించిన బాధితులు మ‌ల్కాజ్‌గిరి సీపీ సుమ‌తికి బాధితులు ఫిర్యాదు చేశారు. వ్యాపార‌వేత్త‌పై కేసు న‌మోదు చేసి, త‌మ‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు.

కుషాయిగూడ ప‌రిధిలోని చ‌క్రీపురం భ‌గ‌వాన్ కాల‌నీకి చెందిన ప‌బ్బా చంద్ర‌శేఖ‌ర్.. స్థానికంగా శ్రీ వెంక‌టేశ్వ‌ర మార్కెటింగ్ పేరుతో సిమిల్ డీల‌ర్‌షిప్ నిర్వ‌హిస్తున్నాడు. దాదాపు 30 ఏండ్లుగా భ‌గ‌వాన్ కాల‌నీలోనే నివాస‌ముంటున్నాడు. ఇల్లు క‌ట్టుకోవాల‌ని చెప్పి, అత్య‌వ‌స‌ర ఆర్థిక ప‌రిస్థితి ఉంద‌ని, నాన్న‌కు ఆరోగ్యం బాగాలేద‌ని, అమ్మాయికి పెళ్లి చేయాల‌ని చెప్పి.. అధిక వ‌డ్డీ ఆశ‌జూపి స్థానికుల నుంచి రూ. 50 కోట్ల వ‌ర‌కు అప్పు తీసుకున్నాడు. చంద్ర‌శేఖ‌ర్‌ను న‌మ్మి 60 మంది దాకా అప్పు ఇచ్చారు.

జూన్ 22న అదృశ్యం

ఉన్న‌ట్టుండి ప‌బ్బా చంద్ర‌శేఖ‌ర్ జూన్ 22న త‌న భార్య‌తో క‌లిసి అదృశ్య‌మ‌య్యాడు. ఆ రోజు నుంచి నేటి వ‌ర‌కు తిరిగి రాక‌పోవ‌డంతో.. బాధితులంద‌రూ తాము మోస‌పోయామ‌ని గ్ర‌హించారు. దీంతో మ‌ల్కాజ్‌గిరి సీపీ సుమ‌తికి బాధితులు ఫిర్యాదు చేశారు. చంద్ర‌శేఖ‌ర్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వ‌స్తుంది. త‌మ ఇద్ద‌రు కూతుళ్ల‌ను బంధువుల నివాసాల వ‌ద్ద వ‌దిలివెళ్లిన‌ట్లు తెలిసింది.

Advertisement
Advertisement