త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Woman Murder | ప‌ట్ట‌ప‌గ‌లే క‌త్తిపోట్లు.. హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల దారుణ హ‌త్య‌

Woman Murder | హైద‌రాబాద్ న‌గ‌రంలో దారుణం జ‌రిగింది. ప‌ట్ట‌ప‌గ‌లే ఇద్ద‌రు మ‌హిళ‌లు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు.

S

Hyderabad | Published On Nov 4, 2026, 7.27 pm IST

Woman Murder | ప‌ట్ట‌ప‌గ‌లే క‌త్తిపోట్లు.. హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల దారుణ హ‌త్య‌
Advertisement

Woman Murder | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో దారుణం జ‌రిగింది. ప‌ట్ట‌ప‌గ‌లే ఇద్ద‌రు మ‌హిళ‌లు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సిద్ధిఖ్ అనే వ్యక్తి తన అత్తింటి కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు మహిళలు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతులను సిద్ధిఖ్ అత్త నిరంజన్ బి, బావమరిది యూసుఫ్ భార్య రేష్మాగా గుర్తించారు.

కాగా, ఈరోజు ఉదయం బాధిత కుటుంబ సభ్యులు సిద్ధిఖ్ నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉందని, తమకు పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతూ మీర్‌పేట్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే, బాధితులు రక్షణ కోరినప్పటికీ పోలీసులు తగిన భద్రత కల్పించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధిఖ్ కత్తితో దాడి చేసి ఇద్దరు మహిళలను హత్య చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు సిద్ధిఖ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Advertisement
Advertisement