Telangana – AP | తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కమిటీ భేటీ
Telangana - AP | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నదీ జలాల వివాదాలపై ఏర్పాటైన కమిటీ.. శుక్రవారం కేంద్రం జల సంఘం కార్యాలయంలో సమావేశమైంది.
Telangana - AP | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నదీ జలాల వివాదాలపై ఏర్పాటైన కమిటీ.. శుక్రవారం కేంద్రం జల సంఘం కార్యాలయంలో సమావేశమైంది. కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి సీడబ్ల్యూసీ అధికారులు, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, ఎన్‌డబ్ల్యూడీఏ చైర్మన్లు, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. నీటి పంపకాలు, సమస్యలు, వివాదాలపై అధికారుల కమిటీ తొలిసారి భేటీ అయింది.
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యలను పరిష్కారించేందుకు జనవరి 2వ తేదీన కేంద్రం 15 మంది అధికారులతో ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేంద్ర జల్ శక్తి ఏర్పాటు చేసిన కమిటీకి సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షత వహించనున్నారు.
కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించే ఈ కమిటీలో తెలంగాణ నుంచి ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ ఆదిత్యానాథ్‌దాస్‌తోపాటు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ప్రత్యే క కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, ఏపీ నుంచి ఆ రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ న ర్సింహమూర్తి, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈలను మెంబర్లుగా నియమించింది.
అలాగే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మన్ బిశ్వా స్, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(జీఆర్‌ఎంబీ) చైర్మన్ బీపీ పాండే, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) సీఈ దాస్, సీడబ్ల్యూసీ ప్రా జెక్టు అప్రయిజల్ ఆర్గనైజేషన్(పీఏవో) సీఈ పైథాంకర్‌ను కేంద్రం నుంచి సభ్యులుగా కమిటీలో చోటు కల్పించడంతో పాటు సాంకేతిక నిపుణులను సైతం నియమించుకొనే వెసులుబాటు కల్పించింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



