Harish Rao | రేవంత్ రెడ్డి పులి కాదు.. ఊసరవెల్లి
Harish Rao | నల్లమల పులి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి పులి కాదు ఊసరవెల్లి అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ఊసరవెల్లి రంగులు మారుస్తది రేవంత్ రెడ్డి మాటలు మారుస్తాడు అని మండిపడ్డారు.
ఊసరవెల్లి రంగులు మారుస్తది
రేవంత్ రెడ్డి మాటలు మారుస్తాడు
గ్యారెంటీలకు గోరి కట్టిండు
బాండ్ పేపర్లను బొంద పెట్టిండు
తుర్క కాశ సంక్షేమ సంఘం మీటింగ్‌లో హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర న్యూస్ : నల్లమల పులి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి పులి కాదు ఊసరవెల్లి అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ఊసరవెల్లి రంగులు మారుస్తది రేవంత్ రెడ్డి మాటలు మారుస్తాడు అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినంక 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ మాటలు చెప్పారు. బాండ్ పేపర్లు రాసిచ్చారు. ఇప్పటికీ వెయ్యి 30 రోజులైంది ఎన్ని గ్యారెంటీలు అమలు చేశారో సమాధానం చెప్పాలి. గ్యారెంటీలకు గోరీలు కట్టిండు, బాండ్ పేపర్లను బొంద పెట్టిండు రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి నిప్పులు చెరిగారు. తెలంగాణ తుర్క కాశ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గజ్వేల్‌లో నిర్వహించిన హక్కుల సాధన కార్యక్రమంలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ మాటలు మస్తు చెప్పింది. బడ్జెట్‌లో రూ. 4 వేల కోట్ల కేటాయిస్తాం అన్నారు. మైనారిటీ డిక్లరేషన్ అంటూ అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఎన్ని అమలు అయ్యాయో మీకే బాగా తెల్సు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు మైనారిటీ బడ్జెట్ కేవలం రూ. 300 కోట్లు మాత్రమే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బడ్జెట్‌ను పెంచుకుంటూ రూ. 1800 కోట్ల వరకు తీసుకొచ్చారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
మైనారిటీలను చాలా ఘోరంగా మోసం చేసింది
కేసీఆర్ రూ. 1800 కోట్లు మాత్రమే మైనారిటీలకు కేటాయిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే రూ. 4000 కోట్లు ఇస్తామంటూ అబద్ధాలు పలికి నేడు రూ. 1300 కోట్లు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అంటే కేసీఆర్ కంటే రూ. 500 కోట్ల తక్కువనే. తుర్కకాశి, మైనారిటీ ముస్లింలకు కార్పొరేషన్‌లో ఉన్న ఒక్క రూపాయి కూడా లబ్ధి జరగడం లేదు. గడిచిన మూడు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలను చాలా ఘోరంగా మోసం చేసింది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఇచ్చింది రూ. 14 కోట్లు మాత్రమే
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన విధంగా మైనారిటీలకు కూడా ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఇచ్చి ప్రోత్సహించిన ఘనత కేసీఆర్‌ది. గత పదేండ్ల పాలనలో రూ. 1550 కోట్ల ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ను మైనారిటీ విద్యార్థులకు అందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆ స్కాలర్‌షిప్‌లను ఖతం చేసింది. గడచిన మూడు సంవత్సరాలలో కాంగ్రెస్ ఇచ్చింది రూ. 14 కోట్లు మాత్రమే అని హరీశ్‌రావు తెలిపారు.
ఉర్దూ అకాడమీ ఉద్యోగులకు సంవత్సరం నుంచి జీతాలు లేవు
మైనారిటీ కార్పొరేషన్‌లో ఏడు నెలల నుంచి ఉద్యోగులకు జీతాలు లేవు. ఉర్దూ అకాడమీ ఉద్యోగులకు సంవత్సరం నుంచి జీతాలు లేవు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు షాదిఖానాలను నిర్మించారు. కేసీఆర్ హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ అంటూ తేడా లేకుండా అందరినీ సమానంగా చూశారు అని ఆయన తెలిపారు.
ఒకప్పుడు గజ్వేల్‌కు పిల్లని ఇవ్వాలంటే భయపడే వాళ్ళు
ఒకప్పుడు గజ్వేల్‌కు పిల్లని ఇవ్వాలంటే భయపడే వాళ్ళు. నా బిడ్డతో నీళ్ళు మోపిస్తారు అని భయపడి పిల్లల్ని కూడా ఇచ్చే వాళ్ళు కాదు, కానీ కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సంవత్సరం లోపల నీటి కష్టాలను తీర్చాడు. ఆడబిడ్డలు బిందె పట్టుకొని రోడ్డుమీదికి రాకుండా కేసీఆర్ ఇంటింటికి నల్లా నీళ్లను అందించారు. కేసీఆర్ గజ్వేల్ రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు కొండపోచమ్మను, మల్లన్న సాగర్‌ను కట్టి చెక్ డ్యాంలు, కాల్వలతో ప్రతి ఎకరాకు నీళ్లు అందించారు. కన్నెపల్లిలో కటుక ఒత్తితే మల్లన్న సాగర్‌లో నీళ్లు దుంకుతాయి. గోదావరిలో పారుతున్న నీళ్లను ఎత్తుకోలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు. కన్నెపల్లిలో కటుక ఒత్తితే రైతులకు నీళ్లు కనిపిస్తాయి, కేసీఆర్ గుర్తొస్తాడు, పంటలు కొనాల్సి వస్తది, యూరియా ఇయ్యాల్సి వస్తది అని భయపడి రేవంత్ రెడ్డి రైతులకు ద్రోహం చేస్తున్నాడు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
మళ్ళా మళ్లీ చూడలేదు రేవంత్ రెడ్డి
మల్లన్న సాగర్ రైతుల కోసం ఆనాడు కేసీఆర్ రూ. 1260 కోట్లు ఖర్చు పెట్టిండు. మల్లన్న సాగర్ రైతుల గురించి రెండు రోజులు దొంగ దీక్షలు చేసాడు. మేము అధికారంలోకి వస్తే పరిహారం డబుల్ ఇస్తా అన్నాడు. మళ్ళా మళ్లీ చూడలేదు రేవంత్ రెడ్డి. మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్‌కు నీళ్లు తరలించాలని చూస్తున్న రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న ఐదు-పది శాతం బకాయిలను చెల్లించనిది ఎట్లా తీసుకపోతావో చూస్తామని అన్నారు.
తాజావార్తలు
- ●Anushka vs Rashmika Mandanna | రష్మిక వర్సెస్ అనుష్క - మైసాకు పోటీగా జేజమ్మ మలయాళం మూవీ
- ●John Wesley | 13 కోట్ల ఓట్లను తొలగించడానికి జ్ఞానేశ్ కుమారే కారణం
- ●Ramchandar Rao | ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్టు కాదు
- ●Drinking Water | హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు మంచినీళ్లు బంద్
- ●Bhogi Teaser | భోగి టీజర్ రిలీజ్ - రగ్గ్డ్ లుక్‌లో శర్వానంద్ - తెలంగాణ అమ్మాయిగా అనుపమ
- ●Asaduddin Owaisi | ఆ సూపరింటెండెంట్ లంచాలు తీసుకొని రౌడీషీటర్లను వదులుతున్నరు

Anushka vs Rashmika Mandanna | రష్మిక వర్సెస్ అనుష్క - మైసాకు పోటీగా జేజమ్మ మలయాళం మూవీ

John Wesley | 13 కోట్ల ఓట్లను తొలగించడానికి జ్ఞానేశ్ కుమారే కారణం

Ramchandar Rao | ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్టు కాదు

Drinking Water | హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు మంచినీళ్లు బంద్




