Harish Rao | హరీశ్‌రావుపై ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు
Harish Rao | అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికార పక్షంపై ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేస్తుండగా, అదే స్థాయిలో ప్రతిపక్షంపై కూడా అధికార పక్షం నేతలు ఫిర్యాదు చేస్తున్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికార పక్షంపై ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేస్తుండగా, అదే స్థాయిలో ప్రతిపక్షంపై కూడా అధికార పక్షం నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు క్షుద్ర పూజల వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని కోరుతూ టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా చనగాని దయాకర్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్ రావు తన కుట్ర బుద్ధితో తెలంగాణలో వర్షాలు పడకుండా, కరువు సంభవించాలని , తెలంగాణ ప్రజలు కరువు, కాటకాల తో ఇబ్బంది పడాలని నీచంగా వ్యహరించారు. మార్చి 2న తిరుచిరాపల్లె (తమిళనాడు), మే 31 నుంచి జూన్ 1 వరకు శివమొగ్గ (కర్ణాటక)లో, జూన్ 2న తిరుచిరాపల్లె (తమిళనాడు)లో, జూలై 23న శివమొగ్గ (కర్ణాటక)లో హరీష్ రావు స్వయంగా వెళ్లి, పూజారులతో క్షుద్ర పూజలు చేయించారని ఆరోపించారు.
లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ లబ్ధి కోసం చట్ట విరుద్ధమైన, క్షుద్ర రాజకీయాలుకు పాల్పడి ప్రజలను గందర గోళానికి గురిచేసి చర్యలకు హరీష్ రావు వ్యహరించారు. రాష్టానికి నష్టం కలిగించేలా తాంత్రిక, క్షుద్ర పూజలు చేయించినందుకు, ప్రభుత్వంపైన కుట్రలకు పాల్పడినందుకు హరీష్ రావు పైన బీఎన్ఎస్, సంబంధిత చట్టాల ప్రకారం ఆయనపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చనగాని దయాకర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత






