Rats Bit Female Students | గురుకుల పాఠశాలలో దారుణం.. 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు
Rats Bit Female Students | ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో తరచూ బయట పడుతున్న ఎలుకల బెడద కలవరపెడుతోంది. ఇటీవల ఘటనలు మరవక ముందే తాజాగా పాలకుర్తి నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మరో దారుణం వెలుగు చూసింది.
Rats Bit Female Students | త్రినేత్ర న్యూస్: ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో తరచూ బయట పడుతున్న ఎలుకల బెడద కలవరపెడుతోంది. ఇటీవల ఘటనలు మరవక ముందే తాజాగా పాలకుర్తి నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మరో దారుణం వెలుగు చూసింది. పాఠశాల వసతి గదుల్లో గత రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు 14 మంది విద్యార్థినులను కరిచాయి. చేతులు, కాళ్లపై కరవడంతో దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత రాత్రి విద్యార్థినిలు నిద్రకు ఉపక్రమించారు. వారు నిద్రలోకి జారుకున్న తర్వాత కాళ్లు, చేతులపై ఎలుకలు కరవడంతో అస్వస్థతకు గురయ్యారు. బాధితులంతా 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థినులుగా సిబ్బంది పేర్కొన్నారు.
విషయం తెలిసిన వెంటనే సిబ్బంది విద్యార్థినులను పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. యాంటీరేబిస్ (Anti-rabies), టీటీ (TT) వ్యాక్సిన్లు ఇప్పించారు. పాఠశాల పరిసరాల్లో చెత్త పేరుకుపోవడం, మురుగునీటి కాలువలు, ముళ్ల పొదలు పెరగడం వల్ల ఎలుకల బెడద ఎక్కువగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.
కాగా ఈ ఘటన విషయాన్ని తల్లిదండ్రులకు సకాలంలో తెలియజేయకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇంకేదైనా ప్రమాదం జరిగినా ఇంతేనా.. అని వారు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల, వసతి గృహాల పరిసరాల్లో వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంబంధిత అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ లేఖ రాసినట్లు తెలిసింది.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan | ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా బొంతు రామ్మోహన్ నియామకం
సెప్టెంబర్ 25, 2026

ED Notices to Arikepudi Gandhi | ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బిక్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఈడీ
సెప్టెంబర్ 25, 2026

Preeti Munde | మిస్ ఎర్త్ వాటర్ ఇండియాగా ఆదిలాబాద్ యువతి
సెప్టెంబర్ 25, 2026
తాజావార్తలు
- ●CM Omar Abdullah | రాష్ట్ర హోదాను పునరుద్దరించండి.. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో తీర్మానం
- ●itel ACE 4 Shine | సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఫీచర్ ఫోన్.. ధర కేవలం రూ.1059 మాత్రమే..
- ●Bonthu Rammohan | ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా బొంతు రామ్మోహన్ నియామకం
- ●Landslides Hit Sikkim | సిక్కింలో వరదలు.. గ్రామంపై విరిగిపడ్డ కొండచరిలు
- ●NSE Share Price | నిరాశ పరిచిన ఎన్ఎస్ఈ షేర్లు.. స్వల్పంగా పతనం.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచనలు..
- ●ED Notices to Arikepudi Gandhi | ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బిక్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఈడీ

CM Omar Abdullah | రాష్ట్ర హోదాను పునరుద్దరించండి.. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో తీర్మానం

itel ACE 4 Shine | సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఫీచర్ ఫోన్.. ధర కేవలం రూ.1059 మాత్రమే..

Bonthu Rammohan | ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా బొంతు రామ్మోహన్ నియామకం

Landslides Hit Sikkim | సిక్కింలో వరదలు.. గ్రామంపై విరిగిపడ్డ కొండచరిలు



