Sanjay Gaikwad | ఆత్మహత్య చేసుకునే రైతుల అంత్యక్రియలకు ఎవరూ హజరుకావొద్దు: ఎమ్మెల్యే సంజయ్
Sanjay Gaikwad | ఆత్మహత్య (Suicide) చేసుకునే రైతుల అంత్యక్రియలకు ఎవరూ హాజరుకావొద్దని మహారాష్ట్రలోని బులదానా శివసేన (ఏక్‌నాథ్) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ (Sanjay Gaikwad) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడే ఆత్మహత్యల వల్ల వచ్చే పరిణామాలను ఇతరులు గ్రహిస్తారని చెప్పారు.
Sanjay Gaikwad | త్రినేత్ర న్యూస్: ఆత్మహత్య (Suicide) చేసుకునే రైతుల అంత్యక్రియలకు ఎవరూ హాజరుకావొద్దని మహారాష్ట్రలోని బులదానా శివసేన (ఏక్‌నాథ్) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ (Sanjay Gaikwad) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడే ఆత్మహత్యల వల్ల వచ్చే పరిణామాలను ఇతరులు గ్రహిస్తారని చెప్పారు. రైతులను `పనికిరానివారు` అంటూ వంచిత్ బహుజన్ అఘాడీ (VBA) చీఫ్ ప్రకాశ్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సంజయ్ గైక్వాడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు (Farmers) ఇబ్బందుల్లో ఉంటే ఆత్మహత్యలకు పాల్పడకుండా, తమ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా ప్రభుత్వాన్ని ఆశ్రయించి సహాయం కోరాలని సూచించారు. తమ మరణం తర్వాత కుటుంబ సభ్యులు పడే కష్టాలను రైతులు ఆలోచించాలన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల అంత్యక్రియలకు (Last Rites) వెళ్లడం మానేస్తే, ఆ సమయంలో జంతువులు వారి మృతదేహాన్ని తింటే ఏమవుతుందో చూసైనా ఇతరులు మారుతారు. ఆ తర్వాత ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని చెప్పారు. ఆ భయంతోనైనా ఇతరులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. బలవన్మరణానికి పాల్పడే రైతులు తమ భార్యాపిల్లలను తీరని కష్టాల్లోకి నెట్టేస్తున్నారని వెల్లడించారు. ఏడు జన్మల పాటు కలిసి ఉంటామని పెండ్లి ప్రమాణాలు చేసుకుని, ఆత్మహత్యలతో ఆ బంధాన్ని మధ్యలోనే తుంచేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
- ●ISRO URSC Recruitment | పదో తరగతి, ఐటీఐ అర్హతతో.. ఇస్రోలో టెక్నీషియన్, డ్రైవర్ పోస్టులు
- ●వంద సీట్లు.. అంత ఈజీనా? కాంగ్రెస్ ధీమా వెనుక లెక్కేంటి?
- ●Harish Rao | తప్పుడు లెక్కలు చెప్పి వాస్తవాల నుంచి తప్పించుకోలేరు.. మంత్రి ఉత్తమ్‌పై హరీశ్ ఫైర్
- ●Horoscope | అక్టోబర్ 29 రాశిఫలాలు.. ఈ రాశివారు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం!
- ●NHRC | ఐశ్వర్య మృతిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ
- ●Induja | కేటీఆర్‌పై పోలీసులకు బల్మూర్ వెంకట్ భార్య ఫిర్యాదు

ISRO URSC Recruitment | పదో తరగతి, ఐటీఐ అర్హతతో.. ఇస్రోలో టెక్నీషియన్, డ్రైవర్ పోస్టులు
వంద సీట్లు.. అంత ఈజీనా? కాంగ్రెస్ ధీమా వెనుక లెక్కేంటి?

Harish Rao | తప్పుడు లెక్కలు చెప్పి వాస్తవాల నుంచి తప్పించుకోలేరు.. మంత్రి ఉత్తమ్‌పై హరీశ్ ఫైర్

Horoscope | అక్టోబర్ 29 రాశిఫలాలు.. ఈ రాశివారు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం!






