త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijayashanthi | బియ్యం పండించే రాష్ట్రంలోనే.. బియ్యం కొనలేని దుస్థితి ఎందుకు వచ్చింది?: విజ‌య‌శాంతి

Vijayashanthi | రాష్ట్రంలో బియ్యం ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి (Vijayashanthi) ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. బియ్యం పండించే రాష్ట్రంలోనే బియ్యం (Rice Price) కొనలేని దుస్థితి ఎందుకు వచ్చిందని రేవంత్ స‌ర్కార్‌ను (Revanth Reddy) నిల‌దీశారు.

G

Telangana | Published On Nov 6, 2026, 12.24 pm IST

Vijayashanthi | బియ్యం పండించే రాష్ట్రంలోనే.. బియ్యం కొనలేని దుస్థితి ఎందుకు వచ్చింది?: విజ‌య‌శాంతి
Advertisement

Vijayashanthi | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో బియ్యం ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి (Vijayashanthi) ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. బియ్యం పండించే రాష్ట్రంలోనే బియ్యం (Rice Price) కొనలేని దుస్థితి ఎందుకు వచ్చిందని రేవంత్ స‌ర్కార్‌ను (Revanth Reddy) నిల‌దీశారు. ఒకప్పుడు రూ.1,500కు దొరికిన 25 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు రూ.2,500కు పెరగ‌డానికి కారణం ఏంటి?.. కిలో సన్నబియ్యం రూ.85 నుంచి రూ.100 పలుకుతున్నా ప్ర‌భుత్వం ధరలను ఎందుకు నియంత్రించడం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెరుగుతున్న ధ‌ర‌ల‌పై త‌క్ష‌ణ‌మే స్పందించాలంటూ ఫేస్‌బుక్ వేదిక‌గా ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

`బియ్యం పండించే రాష్ట్రంలోనే బియ్యం కొనలేని దుస్థితి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు 1,500 రూపాయలకు దొరికిన 25 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు 2,500 రూపాయల కు పెరిగిన కారణం ఏమిటి? కిలో సన్నబియ్యం 85 రూపాయలు నుంచి 100 రూపాయలు పలుకుతున్నా ఎందుకు ధరలను నియంత్రించడం లేదు? అని సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తున్న‌ది.

మార్కెట్‌లో ప్రస్తుతం విక్రయిస్తున్న పాత సన్న బియ్యం గత ఏడాది వానాకాలం, అంతకు ముందు సీజన్‌లోనివని సమాచారం అందుతుంది. అప్పుడు ప్రజల అవసరాలకు మించి ధాన్యం ఉత్పత్తి అయ్యింది. దీన్నిబట్టి మార్కెట్లో పాత బియ్యానికి కొరత లేదని స్పష్టంగా అర్ధమవుతున్న‌ది. ఒకవేళ ఎల్‌నినో ప్రభావం బియ్యం విక్రయాలపై ఉంటే.. అది యాసంగిలోనే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే వచ్చే ఏడాది జూన్ నెలలో ఎల్‌నినో ప్రభావం సన్న బియ్యం విక్రయాలపై పడే అవకాశం ఉండవచ్చు. ఈ విషయాన్ని కప్పిబుచ్చి, కొందరు వ్యాపారాలు బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయించే కుట్ర చేస్తున్నారని తెలుస్తుంది. ఈ అక్రమ దందాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.

పగడ్బందిగా చర్యలు తీసుంటున్నామని అధికారులు చెబుతున్నా.. మార్కెట్‌లో బియ్యం ధరలు ఎందుకు తగ్గడం లేదో ఈ మతలబును చుస్తే అర్ధం అవుతుంది. వ్యాపారులు నిల్వల పేరుతో చేసే మాయ వల్లనా?.. లేక అక్రమ రవాణా వల్లనా?.. సరఫరాలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా?.. అనే సందేహాలు ప్రజలకు వస్తున్నాయి. అక్రమ నిల్వలపై తనిఖీలు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదేశించినప్పటికీ.. కింది స్థాయిలో అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కవడం వల్లే సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

మరోవైపు పేదలకు ఉచితంగా అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థలోనూ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మరణించిన వారి పేర్లు, నకిలీ కార్డులు, అనర్హుల నమోదులు, బియ్యం అక్రమ మళ్లింపులు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రైతుల నుంచి సేకరించిన ధాన్యం మిల్లుల నుంచి గోదాములకు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు చేరే వరకు ప్రతి గింజకు లెక్క ఉండాలని మంత్రి స్పష్టంగా ఆదేశించారు.

తెలంగాణకు ఏడాదికి 28.56 లక్షల టన్నుల బియ్యం అవసరం. అక్టోబర్ 16 నాటికి 9.64 లక్షల టన్నుల నిల్వలు ఉండగా, మరో 18.39 లక్షల టన్నులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కల్లో పారదర్శకత ఉందా అనే విషయాన్ని ప్రభుత్వం నిగ్గుతేల్చలి. మిల్లర్లు, వ్యాపారులు, అధికారులు ఎవరైనా బియ్యం పంపిణీ విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. పౌర సరఫరాల వ్యవస్థలో కింది స్థాయిలో జరిగే తప్పుల వల్ల ప్రభుత్వానికి అపప్రద రాకూడదన్నది నా అభిమతం.` అంటూ విజ‌య‌శాంతి పోస్టు చేశారు.

Advertisement
Advertisement