త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijaya Shanthi | తేజ‌స్వి సూర్య అనుచిత వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ బీజేపీ ఖండిస్తుందా? లేదా?: విజ‌య‌శాంతి

Vijaya Shanthi | పాకిస్థాన్ (Pakistan) విభజన కన్నా ఘోరంగా తెలంగాణ (Telangana) రాష్ట్ర విభజన జరిగిందని క‌ర్ణాట‌క బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి (Tejasvi Surya) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలను, ప్రాణ త్యాగాలను కించపరచే విధంగా ఉన్నాయ‌ని ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి (Vijaya Shanthi) అన్నారు.

G

Telangana | Published On Apr 17, 2026, 9.42 am IST

Vijaya Shanthi | తేజ‌స్వి సూర్య అనుచిత వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ బీజేపీ ఖండిస్తుందా? లేదా?: విజ‌య‌శాంతి
Advertisement

Vijaya Shanthi | త్రినేత్ర‌.న్యూస్‌: పాకిస్థాన్ (Pakistan) విభజన కన్నా ఘోరంగా తెలంగాణ (Telangana) రాష్ట్ర విభజన జరిగిందని క‌ర్ణాట‌క బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి (Tejasvi Surya) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలను, ప్రాణ త్యాగాలను కించపరచే విధంగా ఉన్నాయ‌ని ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి (Vijaya Shanthi) అన్నారు. తేజ‌స్వీ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ బీజేపీ ఖండిస్తుందా? లేదా? అని ప్ర‌శ్నించారు. పార్లమెంట్ సీట్ల పెంపుదల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ బాధ్యతారహిత కామెంట్స్ పుండుమీద కారంచల్లే విధంగా ఉన్నాయని మండిప‌డ్డారు. ఓ వైపు దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష చూపుతోందని విమర్శలు వస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎంపీ తెలంగాణ సెంటిమెంట్‌ను కించపరుస్తూ పార్లమెంట్ వేదికగా మాట్లాడటం గర్హనీయమ‌ని చెప్పారు.

లోకసభ స్పీకర్ ఈ వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కోరాల‌న్నారు. అలా చేసి, ఈ తప్పును సరిదిద్దాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సూర్య తేజస్వి కామెంట్స్‌ను ఖండిండం మానేసి, ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణను సాధించగలరా అనే విధంగా టీబీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించడం విడ్డూరంగా ఉంద‌ని మండిప‌డ్డారు. తాను, కేసీఆర్ పార్లమెంట్ లోపల, బయట తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా పోరాటం చేశామనే విషయాన్ని తెలంగాణ ఉద్యమకారులను అడిగితే చెబుతార‌న్నారు. ఈ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించడం వల్లే సోనియాగాంధీ పెద్దమనసుతో రాష్ట్ర విభజనకు అంగీకారించరాన్న విషయం అందరికీ తెలుసని చెప్పారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించకుండా.. సూర్య తేజస్వి చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఖండిస్తోందా లేదా అనే ప్రశ్నకు క్లారిటీ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

Read Also..

ఇది అవ‌మానం.. మన పోరాటంపై దాడి.. గౌరవంపై గాయం: పొన్నం ప్రభాకర్

తెలంగాణ ఏర్పాటును దేశ విభ‌జ‌నతో పోల్చ‌డం అత్యంత మూర్ఖ‌త్వం : కేటీఆర్

 

Advertisement
Advertisement