త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కాంగ్రెస్ తెచ్చిన క‌రువు అని ఎందుకు అంటున్నామో తెలుసా..? : కేటీఆర్

KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా? అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) పేర్కొన్నారు. ఒక్కసారి గర్జిస్తున్న ఈ బాహుబలి పంపులు చూడండి అంటూ ఆయ‌న ఎక్స్ వేదిక‌గా వివ‌ర‌ణ ఇచ్చారు.

S

Telangana | Published On Oct 16, 2026, 2.39 pm IST

KTR | కాంగ్రెస్ తెచ్చిన క‌రువు అని ఎందుకు అంటున్నామో తెలుసా..? : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్ : ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా? అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) పేర్కొన్నారు. ఒక్కసారి గర్జిస్తున్న ఈ బాహుబలి పంపులు చూడండి. కేసీఆర్ నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ పంప్‌హౌస్‌లో ఉన్న 145 మెగావాట్ల పంపులు ఇవి. ప్రపంచంలో ఇంత పెద్ద ఇరిగేషన్ పంపులు మరెక్కడా లేవు అని కేటీఆర్ తెలిపారు.

కృష్ణా నది మీదున్న శ్రీశైలం జలాశయానికి ఈ ఏడాది జూలై 29న ఇన్‌ఫ్లోలు ప్రారంభమయ్యాయి. కానీ 76 రోజుల పాటు కుంభకర్ణ నిద్రపోయింది రేవంత్ సర్కారు. అనేకసార్లు బీఆర్ఎస్ నాయకులు ఈ మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తే మేల్కొని మొన్న నార్లాపూర్ పంప్‌హౌస్‌లో పంపింగ్ ప్రారంభించింది. ఈ సీజన్‌లో వరద వచ్చినప్పటి నుండి నేటి వరకు పంపింగ్ చేసి ఉంటే సుమారు 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉండేది. అంటే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని కేటీఆర్ తెలిపారు.

కానీ కేవలం కేసీఆర్ పేరు రావద్దు అన్న కుట్రతో ఇక్కడ నీటిని ఎత్తిపోయలేదు రేవంత్ ప్రభుత్వం! ఫలితంగానే ఇవ్వాళ తీవ్రమైన సాగునీటి కొరతను తెలంగాణ రైత‌న్న‌లు ఎదుర్కొంటున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement