త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీకి జీవో జారీ: పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | హుస్నాబాద్ నియోజకవర్గ ప్ర‌జ‌ల‌కు ద‌స‌రా కానుక‌గా నూత‌న క‌బడ్డీ అకాడ‌మీ కోసం ప్ర‌భుత్వం జీవో జారీ చేయ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు.

S

Telangana | Published On Oct 16, 2026, 1.43 pm IST

Ponnam Prabhakar | హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీకి జీవో జారీ: పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar |త్రినేత్ర న్యూస్: హుస్నాబాద్ నియోజకవర్గ ప్ర‌జ‌ల‌కు ద‌స‌రా కానుక‌గా నూత‌న క‌బడ్డీ అకాడ‌మీ కోసం ప్ర‌భుత్వం జీవో జారీ చేయ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది యువ‌తీయువ‌కుల్లో అపార‌మైన క్రీడా ప్ర‌తిభ ఉంద‌ని.. వారికి స‌రైన స‌దుపాయాలు క‌ల్పిస్తే జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో రాణించ‌గ‌ల‌ర‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. ఆ ల‌క్ష్యంతోనే క‌బ‌డ్డీ అకాడ‌మీ ఏర్పాట‌కు కృషి చేసిన‌ట్లు తెలిపారు. శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా ఆయ‌న మాట్లాడారు.

20 మంది చొప్పున బాలురు, బాలిక‌లు

క్రీడాభివృద్ధికి మరో ముందడుగు పడింది. ఈ అకాడమీ ద్వారా మొత్తం 40 మంది క్రీడాకారులకు అవకాశం కల్పించనున్నాం. ఇందులో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు వసతితో కూడిన కబడ్డీ శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నాం. బాలురు, బాలికలకు వేర్వేరుగా కోచ్‌లు, వార్డెన్లతో పాటు గ్రౌండ్స్‌మెన్, స్వీపర్, సెక్యూరిటీ గార్డు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాం. ఇందుకు సంబంధించి మొత్తం 8 సేవల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నియామకాలను ఔట్‌సోర్సింగ్ విధానంలో చేపట్టనున్నారు.

ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు చెందిన క్రీడాకారులు కబడ్డీ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి గుర్తింపు సాధించారు. ఈ అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికితీసి, వారికి నాణ్యమైన శిక్షణ అందించి, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఏర్పడుతుంది.

స‌మాన అవ‌కాశాలే మా ల‌క్ష్యం..

బాలురు, బాలికలకు సమాన అవకాశాలు కల్పిస్తూ క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కూడా మా లక్ష్యం. హుస్నాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల యువ క్రీడాకారులకు ఈ అకాడమీ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుంది. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని క్రీడారంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నా. యువతలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తా. హుస్నాబాద్ ప్రజలకు దసరా కానుకగా ఈ కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు అనుమతి లభించడం ఆనందంగా ఉంది అని పొన్నం తెలిపారు.

Advertisement
Advertisement