త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU PhD Award | పాల‌మూరు మ‌ట్టిబిడ్డ రాజ్‌కుమార్‌కు ‘ఓయూ’ పీహెచ్‌డీ ప‌ట్టా

OU PhD Award | పాల‌మూరు మ‌ట్టిబిడ్డ వ‌డ్డేమాన్ రాజ్‌కుమార్‌కు ప్ర‌తిష్టాత్మ‌క ఉస్మానియా యూనివ‌ర్సిటీ పీహెచ్‌డీ ప‌ట్టాను ప్ర‌క‌టిస్తూ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. చ‌దువుకోవాల‌నే సంక‌ల్పంతో చిన్ననాటి నుంచే గురుకుల విద్యాసంస్థ‌లో విద్య‌ను అభ్య‌సించిన రాజ్‌కుమార్.. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా త‌న‌కెంతో ఇష్ట‌మైన వ్య‌వ‌సాయ ప‌ద్ధతుల‌పై ప‌రిశోధ‌న చేసి డాక్ట‌రేట్ ప‌ట్టా పుచ్చుకున్నారు.

S

Telangana | Published On Mar 24, 2026, 5.50 pm IST

OU PhD Award | పాల‌మూరు మ‌ట్టిబిడ్డ రాజ్‌కుమార్‌కు ‘ఓయూ’ పీహెచ్‌డీ ప‌ట్టా
Advertisement

OU PhD Award | త్రినేత్ర‌.న్యూస్ : పాల‌మూరు మ‌ట్టిబిడ్డ వ‌డ్డేమాన్ రాజ్‌కుమార్‌కు ప్ర‌తిష్టాత్మ‌క ఉస్మానియా యూనివ‌ర్సిటీ పీహెచ్‌డీ ప‌ట్టాను ప్ర‌క‌టిస్తూ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. చ‌దువుకోవాల‌నే సంక‌ల్పంతో చిన్ననాటి నుంచే గురుకుల విద్యాసంస్థ‌లో విద్య‌ను అభ్య‌సించిన రాజ్‌కుమార్.. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా త‌న‌కెంతో ఇష్ట‌మైన వ్య‌వ‌సాయ ప‌ద్ధతుల‌పై ప‌రిశోధ‌న చేసి డాక్ట‌రేట్ ప‌ట్టా పుచ్చుకున్నారు. పీహెచ్‌డీ అవార్డు అందుకున్న రాజ్‌కుమార్‌కు శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.


వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం చిన్న మందడి గ్రామానికి చెందిన వడ్డేమాన్ సాయన్న, సంతోషమ్మల కుమారుడు రాజ్‌కుమార్‌.. ఉస్మానియా యూనివర్సిటీలోని పర్యావరణ శాస్త్రం విభాగంలో ప్రొఫెసర్ కుసుమ శైలజ పర్యవేక్షణలో "తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతంలో వ్యవసాయ పద్ధతుల పర్యావరణ సుస్థిరత" అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. ఈ ప‌రిశోధ‌నా గ్రంథాన్ని పరిశీలించిన ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు ఆయనకు పీహెచ్‌డీ పట్టాను ప్రకటిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాజ్‌కుమార్‌కు డాక్టరేట్ రావడం పట్ల ప్రొఫెసర్లు, సహ పరిశోధకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ నాకు పరిశోధనలో సహకరించి వెన్ను తట్టి ప్రోత్సహించిన పీహెచ్‌డీ మార్గదర్శకురాలు ప్రొఫెసర్ కే. శైలజ, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అండగా నిలబడ్డ కుటుంబ సభ్యులకు, సహకరించిన స్నేహితులకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో పర్యావరణానికి తన వంతుగా సేవ చేస్తాను. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానని రాజ్‌కుమార్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement