త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airtel | ఎయిర్‌టెల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏ భాష‌నైనా నేర్పించే డ్యుయోలింగో ప్లాట్‌ఫామ్‌, ఏడాదిపాటు ఫ్రీ..

Airtel | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్.. భాషలను నేర్చుకునే ప్రముఖ వేదిక డ్యుయోలింగోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా సుమారు 37.6 కోట్ల మంది ఎయిర్‌టెల్ కస్టమర్లకు 12 నెలల పాటు సూపర్ డ్యుయోలింగో సబ్‌స్క్రిప్షన్‌ను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందించనుంది.

S

Technology | Published On Sep 4, 2026, 12.34 pm IST

Airtel | ఎయిర్‌టెల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏ భాష‌నైనా నేర్పించే డ్యుయోలింగో ప్లాట్‌ఫామ్‌, ఏడాదిపాటు ఫ్రీ..
Advertisement

Airtel | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్.. భాషలను నేర్చుకునే ప్రముఖ వేదిక డ్యుయోలింగోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా సుమారు 37.6 కోట్ల మంది ఎయిర్‌టెల్ కస్టమర్లకు 12 నెలల పాటు సూపర్ డ్యుయోలింగో సబ్‌స్క్రిప్షన్‌ను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందించనుంది. పాత పీసీ, ల్యాప్‌టాప్‌లకు క్లౌడ్ సేవలను అందిస్తున్న జియోపీసీ తరహాలోనే, ఎయిర్‌టెల్ కూడా తన కస్టమర్లకు డిజిటల్ సేవలను విస్తరిస్తోంది. ఈ ఉచిత వార్షిక సబ్‌స్క్రిప్షన్ మొబైల్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ అంటే వైఫై, డీటీహెచ్ సేవలను వినియోగిస్తున్న అర్హత కలిగిన ఎయిర్‌టెల్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్‌లోని ఎయిర్‌టెల్ యాప్ ద్వారా నేరుగా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఇందుకోసం క్రెడిట్ కార్డు వివరాలను అందించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఆఫర్ నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుంది.

యాడ్స్ లేకుండా ఉప‌యోగించ‌వ‌చ్చు..

సూపర్ డ్యుయోలింగో సబ్‌స్క్రిప్షన్‌లో ప్రకటనలు లేకుండా భాషలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉచిత వెర్షన్‌లో ఉండే సెషన్ పరిమితులు లేకుండా వినియోగదారులు నిరంతరంగా సాధన చేయవచ్చు. అలాగే కృత్రిమ మేధస్సు ఆధారిత రియల్‌టైమ్ మాట్లాడే సాధన, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రివ్యూ సెషన్లు, చేసిన తప్పులను ప్రత్యేకంగా గుర్తించి సరిదిద్దుకునే టూల్స్ వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఆఫర్‌ను ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా అందిస్తున్నారు. ఎయిర్‌టెల్‌కు చెందిన వివిధ రకాల కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఎయిర్‌టెల్ కస్టమర్లు తమ రోజువారీ జీవితంలోనే భాషా అభ్యాసాన్ని కొనసాగించే అవకాశం లభిస్తుంది. డ్యుయోలింగో ద్వారా 40కి పైగా భాషలను నేర్చుకునే అవకాశం ఉంది. భాషలతోపాటు మ్యాథ్స్, మ్యూజిక్, చెస్ వంటి అంశాలకు సంబంధించిన అభ్యాస సేవలు కూడా ఇందులో ఉన్నాయి. భారత్‌లోని భాషా వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డ్యుయోలింగో స్థానికీకరించిన ఇంగ్లిష్ కోర్సులను కూడా క్రమంగా విస్తరిస్తోంది.

మాతృభాష స‌హాయంతో ఇత‌ర భాష‌లు..

ప్రస్తుతం హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, ఉర్దూ మాట్లాడే వారికి ఇంగ్లిష్ నేర్చుకునే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పంజాబీ మాట్లాడే వారి కోసం ఇంగ్లిష్ లెర్నింగ్ మాడ్యూల్‌ను కూడా ఇటీవల తన సేవల్లో చేర్చింది. దీంతో భారతీయ వినియోగదారులకు వారి మాతృభాష ఆధారంగా ఇంగ్లిష్ నేర్చుకునే అవకాశం మరింత సులభమైంది. డ్యుయోలింగో గ్లోబల్ పరిధిని ఎయిర్‌టెల్ భారీ కస్టమర్ నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా ఈ భాగస్వామ్యం ఏర్పడింది. భాషలను నేర్చుకోవడం, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం కోసం కస్టమర్లకు నిర్మితమైన డిజిటల్ లెర్నింగ్ టూల్స్ అందించడమే ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement