త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AAI Recruitment | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 మేనేజర్, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌ జాబ్స్

AAI Recruitment | కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో మేనేజ‌ర్ (Manager), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Junior Executive) పోస్టులను భర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 389 ఉద్యోగాలతో నోటిఫికేషన్ (AAI Recruitment) విడుదల చేసింది.

G

National | Published On Aug 10, 2026, 6.17 am IST

AAI Recruitment | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 మేనేజర్, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌ జాబ్స్
Advertisement

AAI Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో మేనేజ‌ర్ (Manager), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Junior Executive) పోస్టులను భర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 389 ఉద్యోగాలతో నోటిఫికేషన్ (AAI Recruitment) విడుదల చేసింది. అర్హులైన వారు సెప్టెంబర్ 7 వరకు www.aai.aero వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మేనేజర్ పోస్టులకు అయితే నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.40,000 నుంచి రూ.1,40,000 జీతం వస్తుంది. ఆర్కిటెక్చర్, ఫైనాన్స్, ఫైర్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజినీరింగ్-ఎలక్ట్రికల్, కార్పొరేట్ ప్లానింగ్ అండ్‌ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 389
మేనేజర్- 260, జూనియర్ ఎగ్జిక్యూటివ్- 129 చొప్పున ఉన్నాయి.

విద్యార్హతలు: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, ఐటీఐ, బీఈ, బీటెక్‌, ఏంబీఏ, ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించాలి. ఉద్యోగానుభవం త‌ప్ప‌నిస‌రి. 2026 సెప్టెంబర్ 7 నాటికి అభ్య‌ర్థుల వ‌య‌స్సు 32 ఏండ్లు మించకూడదు. అదే, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 ఏండ్లు దాటకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఇంట‌ర్వ్యూ ద్వారా. ఆన్​లైన్ రాత పరీక్ష అనంతరం అప్లికేషన్ వెరిఫికేషన్, తదుపరి పరీక్షలు కండక్ట్ చేస్తారు. ఫైర్ స‌ర్వీసెస్ మేనేజ‌ర్ పోస్టుల‌కు ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్‌, డ్రైవింగ్ టెస్ట్‌, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్​లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 7
అప్లికేష‌న్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూబీడీ, మ‌హిళ‌లు, ఏఏఐ అప్రెంటిస్‌కు ఎలాంటి ఫీజు లేదు.
వెబ్​సైట్: www.aai.aero

Advertisement
Advertisement