Murder | రూ.22 కోసం సిరాజ్‌ను హత్యచేసిన మహేశ్..
Murder | ప్రజల్లో రోజురోజుకు నేర ప్రవృత్తి పెరిగిపోతున్నదా? లేదా క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి నేరస్తులుగా మారుతున్నారా?. చిన్నచిన్న విషయాలకే ఎదుటివారిని హత్యలు (Murder) చేస్తూ జైలుపాలవుతున్నారు.
త్రినేత్ర.న్యూస్: ప్రజల్లో రోజురోజుకు నేర ప్రవృత్తి పెరిగిపోతున్నదా? లేదా క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి నేరస్తులుగా మారుతున్నారా?. చిన్నచిన్న విషయాలకే ఎదుటివారిని హత్యలు (Murder) చేస్తూ జైలుపాలవుతున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నాచారంలో మద్యం గ్లాస్ కోసం అన్నాదమ్ములు గొడవపెట్టుకున్నారు. మద్యం మత్తుకు ఆవేశం తోడవడంతో అన్నను మూడంతస్తుల భవనం పైనుంచి తమ్ముడు తోసేశాడు. ఇంకేముంది అసలే తాగి ఉన్నాడు.. ఆపై ఎత్తైన బిల్డింగ్‌పైనుంచి పడటంతో తీవ్రంగా గాయపడిన అన్న మృతిచెందాడు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి మెదక్ జిల్లా చేగుంట (Chegunta) మండలంలో వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.22 కోసం తోటి కార్మికుడిని ఓ వ్యక్తి హత్యచేశాడు.
ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన మహ్మద్ సిరాజ్(30), మహేశ్ కుమార్ వర్మ చేగుంటలో ఒకే గదిలో ఉంటూ ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజున చేగుంట మండలం అనంతసాగర్ వద్ద ఓ చెట్టుకింద కూర్చుని మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో మహేశ్‌కు సిరాజ్ రూ.22 పాతబకాయి ఉన్నాడు. ఆ డబ్బులు ఇవ్వాలని అతడు సిరాజ్‌ను అడిగాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన మహేశ్.. సిరాజ్ తలను పట్టుకొని బలంగా చెట్టుకు కొట్టాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న బండరాయి తెచ్చి తలపై గట్టిగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహేశ్‌పై కనింపించకుండాపోవడంతో అతనిపై అనుమానంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం మాసాయిపేట వద్ద అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించామని తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ వెల్లడించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






