త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | మా పార్టీపై విమ‌ర్శ‌లు త‌గ‌దు.. సీఎం రేవంత్‌కు కిష‌న్ రెడ్డి వార్నింగ్

Kishan Reddy | డీలిమిటేష‌న్ వ‌ల్ల ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ వ్యాఖ్య‌లు స‌రికాదు.. మా పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌ద్ధ‌తి కాద‌ని సుతిమెత్త‌గా వార్నింగ్ ఇచ్చారు.

S

Telangana | Published On Apr 14, 2026, 4.56 pm IST

Kishan Reddy | మా పార్టీపై విమ‌ర్శ‌లు త‌గ‌దు.. సీఎం రేవంత్‌కు కిష‌న్ రెడ్డి వార్నింగ్
Advertisement

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : డీలిమిటేష‌న్ వ‌ల్ల ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ వ్యాఖ్య‌లు స‌రికాదు.. మా పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌ద్ధ‌తి కాద‌ని సుతిమెత్త‌గా వార్నింగ్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల‌కు స‌మ‌న్యాయం జ‌ర‌గాల‌న్న‌దే మా ల‌క్ష్య‌మ‌ని కిష‌న్ రెడ్డి ఉద్ఘాటించారు.

కిష‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే..?

'మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలంటే అసెంబ్లీలో కానీ, పార్ల‌మెంట్‌లో కానీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేయాల్సి ఉంటుంది. అది రాజ్యాంగ‌బద్ధ‌మైన‌టువంటి ప్ర‌క్రియ‌. ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేట‌టువంటి ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది. ఎందుకంటే ఈరోజు 70 కోట్ల మంది మ‌హిళ‌లకు సంబంధించిన ఆత్మ‌గౌర‌వం, హ‌క్కులు, అభివృద్ధిలో వారికి స‌మాన ప్రాధాన్య‌త క‌ల్పించి, భాగ‌స్వామ్యం క‌ల్పించి ముందుకు తీసుకెళ్లాల‌నే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది. గ‌త 50 సంవ‌త్స‌రాలుగా దీనిపై చ‌ర్చ జ‌రుగుతుంది. అనేక పార్టీలు, సంస్థ‌లు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. అనేక‌సార్లు దీనిపై రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌లో కూడా చ‌ర్చ జ‌రిగింది. 2010లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు రాజ్య‌స‌భ‌లో బిల్లు కూడా పాసైంది. చివ‌ర‌కు అనేక కార‌ణాల‌తో ఆ బిల్లు కార్య‌రూపం దాల్చ‌లేదు.
మ‌న దేశంలో 50 శాతం జ‌నాభా మ‌హిళ‌లే ఉన్నారు. కాబ‌ట్టి మ‌హిళ‌ల‌కు ఆత్మ‌గౌర‌వం క‌ల్పించ‌డంతో పాటు రాజ‌కీయంగా వారికి విశ్వాసం క‌ల్పించే ప్ర‌క్రియనే 33 శాతం రిజ‌ర్వేష‌న్లు. ఇది ఒక కొత్త శ‌క్తిని క‌ల్పిస్తుంద‌నే విష‌యంలో ఎలాంటి అనుమానం లేదు. ఇది కేవ‌లం ఒక చ‌ట్టం కాదు. మ‌హిళా సాధికార‌త‌కు వేస్తున్న ముంద‌డుగు అని తెలియ‌జేస్తున్నానని' కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement