త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | లీక్ చేసినోడు మెంట‌లోడు.. తెలంగాణ బీజేపీ ఎంపీల‌పై కిష‌న్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

Kishan Reddy | గ‌త వారం తెలంగాణ బీజేపీ ఎంపీల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని మోదీతో స‌మావేశం సంద‌ర్భంగా చ‌ర్చించిన అంశాలు బ‌య‌ట‌కు లీక్ అయ్యాయి. ఈ క్ర‌మంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Dec 16, 2025, 1.18 pm IST

Kishan Reddy | లీక్ చేసినోడు మెంట‌లోడు.. తెలంగాణ బీజేపీ ఎంపీల‌పై కిష‌న్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు
Advertisement

Kishan Reddy | హైద‌రాబాద్ : గ‌త వారం తెలంగాణ బీజేపీ ఎంపీల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని మోదీతో స‌మావేశం సంద‌ర్భంగా చ‌ర్చించిన అంశాలు బ‌య‌ట‌కు లీక్ అయ్యాయి. ఈ క్ర‌మంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మోదీ మీటింగ్ విష‌యాల‌ను లీక్ చేసినోడు మెంట‌లోడు అని మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మోడీ మమ్మల్ని తిట్టింది బయటకు ఎవరు లీక్ చేశారు? భేటీ విషయాలు బయటకు లీక్ చేసిన మెంటలోడు ఎవ‌డు..? మీటింగ్ విషయాలు బయటకు లీక్ చేయొద్దని మోడీ చెప్పారు.. అయినా ఎవరో మీటింగ్‌లో జరిగిన విష‌యాల‌ను బ‌య‌ట‌కు లీక్ చేశారు, వారెవరో చెప్తే వారిపైన నేనే చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని ప్రధాన మంత్రి సూచించారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయమన్నారని కిష‌న్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశ నుంచి ఇప్పటివరకు ఇద్దరు ఉపరాష్ట్రపతులు అయ్యారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

గత వారం తెలంగాణ బీజేపీ ఎంపీలతో భేటీ అయి.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేరు, మీకంటే అసదుద్దీన్ ఓవైసీ నయం అంటూ ప్ర‌ధాని మోదీ మండిప‌డిన‌ట్లు వార్త‌లు షికారు చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement