Amazfit Cheetah | చీతా సిరీస్‌లో రెండు పవర్‌ఫుల్ స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసిన అమేజ్‌ఫిట్
Amazfit Cheetah | స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ అమేజ్ ఫిట్ భారత మార్కెట్లో తన నూతన స్మార్ట్ వాచ్‌లు చీతా 2 ప్రొ, చీతా 2 అల్ట్రాలను విడుదల చేసింది. చీతా 2 ప్రొ ప్రత్యేకంగా రోడ్ మారథాన్ రన్నర్స్, స్ట్రక్చర్డ్ హైబ్రిడ్ శిక్షణ కోసం అందుబాటులోకి రాగా, చీతా 2 అల్ట్రా వాచ్ అల్ట్రా డిస్టెన్స్, ట్రైల్ రన్నింగ్ అవసరాల కోసం పనిచేస్తుంది.
Technology | Published On Jun 11, 2026, 5.00 pm IST
Amazfit Cheetah | స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ అమేజ్ ఫిట్ భారత మార్కెట్లో తన నూతన స్మార్ట్ వాచ్‌లు చీతా 2 ప్రొ, చీతా 2 అల్ట్రాలను విడుదల చేసింది. చీతా 2 ప్రొ ప్రత్యేకంగా రోడ్ మారథాన్ రన్నర్స్, స్ట్రక్చర్డ్ హైబ్రిడ్ శిక్షణ కోసం అందుబాటులోకి రాగా, చీతా 2 అల్ట్రా వాచ్ అల్ట్రా డిస్టెన్స్, ట్రైల్ రన్నింగ్ అవసరాల కోసం పనిచేస్తుంది. ఈ రెండు వాచ్‌లు హై పెర్ఫార్మెన్స్‌ను ఇస్తాయని కంపెనీ తెలిపింది. ఈ వాచ్‌లను చాలా స్వల్పమైన బరువు ఉండేలా లైట్ మెటీరియల్ తో రూపొందించారు. అలాగే ఎక్కువ సంవత్సరాల పాటు మన్నికగా పనిచేస్తాయని కంపెనీ తెలియజేసింది. గ్రేడ్ 5 టైటానియం బాటమ్ కేస్ ఉన్నందున బిల్డ్ క్వాలిటీ దృఢంగా ఉంటుంది. అలాగే గీతలు పడని సఫైర్ గ్లాస్ లెన్స్‌ను కలిగి ఉంటాయి. చీతా 2 ప్రొ వాచ్ 1.32 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రాత్రిపూట లేగా పగలు సూర్య రశ్మిలోనూ డిస్ ప్లే స్పష్టంగా కనిపించేలా సెట్టింగ్స్‌ను ఇచ్చారు.
చీతా 2 ప్రొ వాచ్‌లో..
చీతా 2 ప్రొ వాచ్ ద్వారా వర్కవుట్‌లను లయ తప్పకుండా క్రమబద్దంగా చేయవచ్చు. జెప్ కోచ్ అనే ఫీచర్ ద్వారా యూజర్లు 3కె దూరాల నుంచి పూర్తి మారథాన్‌ల వరకు శిక్షణ ప్రణాళికలను పొందవచ్చు. ఈ వాచ్‌లలో ప్రత్యేకంగా పేసింగ్, రన్నింగ్ పవర్, లాక్టేట్ థ్రెష్ హోల్డ్ అనే ఫీచర్లను ఇచ్చినందున రన్నింగ్‌ను చక్కగా ట్రాక్ చేస్తాయి. జెప్ యాప్ ద్వారా హెచ్ఆర్‌వీ, వీవో2, నిద్ర నాణ్యత, అలసట స్థాయి వంటి అంశాలను తెలుసుకోవచ్చు. ఈ వాచ్‌లలో అధునాతన డ్యుయల్ బ్యాండ్ మల్టీ శాటిలైట్ జీపీఎస్ వ్యవస్థను కూడా ఇచ్చారు. అందువల్ల కచ్చితమైన ట్రాకింగ్‌ను అందిస్తుంది. చీతా 2 ప్రొ వాచ్‌ను ఫుల్ చార్జ్ చేస్తే 29 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. అయితే సాధారణ వాడకానికి మాత్రం 17 రోజుల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని తెలిపింది. ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైస్‌లకు కనెక్ట్ చేయవచ్చు. 32జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. 24 గంటలు హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ స్థాయిలు, ఒత్తిడి గురించి స్కోర్‌లను తెలుసుకోవచ్చు. థర్మామీటర్ ఫీచర్ కూడా ఉంది. ఫోన్ యాప్‌ల నుంచి నోటిఫికేషన్లు వస్తాయి.
చీతా 2 అల్ట్రాలో..
అమేజ్‌ఫిట్ చీతా 2 అల్ట్రా స్మార్ట్ వాచ్‌లో 1.5 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఉండగా, దీనికి టెంపర్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్‌ను ఇస్తుంది. సఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. గ్రేడ్ 5 టైటానియంతో వాచ్‌ను రూపొంందించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లకు ఇది కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ అయి కాల్స్ మాట్లాడుకోవచ్చు. టెంపరేచర్, బారోమెట్రిక్ ఆల్టిమీటర్ సెన్సార్‌లను ఇచ్చారు. 170 రకాలకు పైగా ఎక్సర్‌సైజ్‌లను ట్రాక్ చేస్తుంది. 64జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. హృదయ స్పందన రేటు, ఆక్సిజన్, ఒత్తిడి స్థాయిలను 24 గంటలూ మానిటర్ చేయవచ్చు. ఫోన్ యాప్‌ల నుంచి నోటిఫికేషన్లు వస్తాయి. 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ ఉంది. సాధారణ వాడకంతో 30 రోజులు, జీపీఎస్ మోడ్‌లో 60 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ తెలిపింది.
అమేజ్‌ఫిట్ చీతా 2 ప్రొ ప్రారంభ ధర రూ.41,999 ఉండగా, అమేజ్‌ఫిట్ చీతా 2 అల్ట్రా ప్రారంభ ధరను రూ.54,999గా నిర్ణయించారు. ఈ వాచ్‌లను అమెజాన్ ఇండియా స్టోర్‌తోపాటు, అమేజ్‌ఫిట్ ఇండియా ఆన్ లైన్ స్టోర్, ఆఫ్ లైన్ స్టోర్‌లలోనూ విక్రయిస్తున్నారు.
సంబంధిత వార్తలు

realme Watch S5 | రూ.7,499కే రియల్‌మి వాచ్ ఎస్5.. జీపీఎస్, అమోలెడ్ డిస్ప్లేతో అదిరిపోయిన ఫీచర్లు..
మే 22, 2026

NoiseFit Halo 3 | క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసే సరికొత్త స్మార్ట్ వాచ్.. ఫోన్‌ను బయటకు తీయాల్సిన పనిలేదు.. ధర చాలా తక్కువ..
మే 9, 2026

CMF Watch 3 Pro | నథింగ్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. అదిరిపోయింది.. ధర తక్కువే..
మే 6, 2026
తాజావార్తలు
- ●Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్‌గా పనిచేశా - టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
- ●TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్
- ●Congress Nationwide Protest | దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సై! 'నీట్' వివాదం, రాజ్యసభ నామినేషన్ రద్దుపై మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా బిగ్ ప్లాన్
- ●Uttam Kumar Reddy | ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటి పారుదలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
- ●Ponguleti Srinivas Reddy | పారదర్శక పాలన కోసమే శాశ్వత భవనాలు: పొంగులేటి
- ●Supreme Court | గృహిణులను కేవలం హోమ్ మేకర్స్‌గా చూడొద్దు.. వారు 'దేశ నిర్మాతలు' : సుప్రీంకోర్టు

Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్‌గా పనిచేశా - టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్

Congress Nationwide Protest | దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సై! 'నీట్' వివాదం, రాజ్యసభ నామినేషన్ రద్దుపై మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా బిగ్ ప్లాన్

Uttam Kumar Reddy | ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటి పారుదలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష



