Ravi Teja | ట్రాన్స్‌జెండర్‌గా మాస్ మహారాజా – రూమర్లలో నిజమెంత?
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఇరుముడి మూవీ ఆగస్ట్ 21న థియేటర్లలోకి రాబోతుంది. ఇరుముడి షూటింగ్ కంప్లీట్ కాకముందే రవితేజ మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Jun 11, 2026, 5.58 pm IST
Ravi Teja | సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఇరుముడి మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మైథలాజికల్ టచ్‌తో తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇరుముడి పూర్తికాకముందే రవితేజ మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. రాజ రాజ చోర, స్వాగ్ సినిమాల ఫేమ్ హసిత్ గోలి దర్శకత్వంలో మాస్ మహారాజా ఓ మూవీ చేయబోతున్నాడట. దిల్ రాజు నిర్మించనున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతుంది.
ట్రాన్స్‌జెండర్....
హసిత్ గోలి సినిమాలో రవితేజ ట్రాన్స్‌జెండర్‌గా ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు టాలీవుడ్ హీరోలెవరూ ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్లు చేయలేదు. ఫస్ట్ టైమ్ రవితేజ ఈ పాత్ర చేయనుండటంతో అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు అక్కియలు బాగున్నారా అనే ఫన్నీ టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
ఇరుముడి తర్వాత...
అయితే ఈ రూమర్లలో నిజం లేదట. ట్రాన్స్‌జెండర్ పాత్రలో రవితేజ కనిపించబోతున్నది అబద్దమని అంటున్నారు. రవితేజ స్టైల్ టిపికల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం. ఇరుముడి రిలీజ్ తర్వాత హసిత్ గోలి సినిమా షూటింగ్‌లో రవితేజ జాయిన్ కానున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- ●PoK Violence | అట్టుడుకుతున్న పీవోకే.. పోలీసుల కాల్పుల్లో 20 మంది మృతి
- ●X Money | ఎలాన్ మస్క్ ఎక్స్ (X) నుంచి ఇక బ్యాంకింగ్ సేవలు.. ఎక్స్ మనీ లాంచ్.. డిజిటల్ బ్యాంకింగ్, 6 శాతం వడ్డీ..
- ●Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత
- ●KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి
- ●Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు
- ●WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..

PoK Violence | అట్టుడుకుతున్న పీవోకే.. పోలీసుల కాల్పుల్లో 20 మంది మృతి

X Money | ఎలాన్ మస్క్ ఎక్స్ (X) నుంచి ఇక బ్యాంకింగ్ సేవలు.. ఎక్స్ మనీ లాంచ్.. డిజిటల్ బ్యాంకింగ్, 6 శాతం వడ్డీ..

Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత

KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి





