Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్‌గా పనిచేశా – టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
నవాబ్ కేఫ్ మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది తేజు అశ్విని. ఈ సినిమాలో హైదరాబాదీ అమ్మాయిగా ఆకట్టుకుంది. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సినీ కష్టాలపై తేజు అశ్విని ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్‌గా పనిచేసినట్లు చెప్పింది...
Entertainment | Published On Jun 11, 2026, 5.16 pm IST
Tollywood | నవాబ్ కేఫ్ మూవీతో కోలీవుడ్ బ్యూటీ తేజు అశ్విని టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సఖి అనే హైదరాబాదీ అమ్మాయిగా కనిపించింది. ప్రస్తుతం తెలుగులో సంగీత్‌తో పాటు మరో రెండు సినిమాలు చేస్తోంది. తమిళంలో బ్లాక్‌మెయిల్ మూవీలో జీవీ ప్రకాష్ కుమార్‌కు జోడీగా కనిపించబోతున్నది.
సేల్స్ గర్ల్‌గా...
తన సినీ ప్రయాణంపై ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజు అశ్విని ఆసక్తికర కామెంట్లు చేసింది. సినిమాల్లోకి రాకముందే సేల్స్ గర్ల్‌గా పనిచేశానని చెప్పింది. "మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చా. నాకంటూ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లు ఎవరూ లేరు. సినిమాల్లోకి రాకముందు పీవీఆర్ థియేటర్‌లో చాలా కాలం పాటు సేల్స్ గర్ల్‌గా పనిచేశా. ఆ థియేటర్‌కు సినిమా చూడటానికి వచ్చిన ఓ డైరెక్టర్ ద్వారా వెబ్‌సిరీస్‌లో ఆఫర్ వచ్చింది" అని తేజు అశ్విని అన్నది.
కొవిడ్ కారణంగా...
"ముందు నుంచి నాకు యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉండేది. వెబ్‌సిరీస్‌లో ఆఫర్ రాగానే సేల్స్ గర్ల్ జాబ్ మానేశా. సినిమాలపైనే ఫోకస్ చేయాలని అనుకున్నా. కానీ నేనొకటి తలిస్తే మరోటి జరిగింది. అదే టైమ్‌లో కొవిడ్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో నా ఆశలన్నీ ఆవిరయ్యాయి. మళ్లీ సేల్స్ గర్ల్ జాబ్‌లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యా. కానీ అదే టైమ్‌లో లాక్‌డౌన్ టైమ్ పేరుతో మరో సిరీస్‌లో ఛాన్స్ వచ్చింది. చాలా తక్కువ మందితో మేమే స్వయంగా సీన్లు షూట్ చేసి ప్రొడక్షన్ టీమ్‌కు పంపించేవాళ్లం. వాళ్లు ఎడిట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేవాళ్లు. అలా ఎన్నో కష్టాలతో తన సినీ ప్రయాణం మొదలైంది" అని తేజు అశ్విని చెప్పింది. ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
నన్ను తీసేశారు...
తమిళంలో కొన్ని మంచి అవకాశాలను తాను మిస్సయ్యానని, లవర్‌తో పాటు డీమోంటే కాలనీ 2లో హీరోయిన్‌గా ఫైనల్ అయ్యానని, కానీ చివరి నిమిషంలో తనను కాదని ఆ అవకాశాలను మరొకరికి ఇచ్చారని చెప్పింది. ఆమె కామెంట్లు వైరల్ అవుతోన్నాయి. తమిళం మూవీ కాథు వకుల రెండు కాదల్ మూవీలో సమంత స్నేహితురాలిగా కూడా తేజు అశ్విని కనిపించింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Revanth Reddy | హైదరాబాద్ అభివృద్ధికి లక్ష కోట్లివ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- ●OTT | ఈ సారి మరింత బోల్డ్ - నలుగురు హాట్ హీరోయిన్లు నటించిన తెలుగు వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
- ●TRS vs BRS | టీఆర్ఎస్పై బీఆర్ఎస్ అభ్యంతరం.. ఈసీకి ఫిర్యాదు
- ●Dev Ji | ఇంటర్‌లోనూ పాసైన మాజీ మావోయిస్ట్ దేవ్‌జీ.. తెలుగులో ఎన్ని మార్కులంటే..?
- ●Ravi Teja | ట్రాన్స్‌జెండర్‌గా మాస్ మహారాజా - రూమర్లలో నిజమెంత?

Revanth Reddy | హైదరాబాద్ అభివృద్ధికి లక్ష కోట్లివ్వండి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

OTT | ఈ సారి మరింత బోల్డ్ - నలుగురు హాట్ హీరోయిన్లు నటించిన తెలుగు వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

TRS vs BRS | టీఆర్ఎస్పై బీఆర్ఎస్ అభ్యంతరం.. ఈసీకి ఫిర్యాదు






