త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Cabinet | తెలంగాణ‌లో రెండు హైవేల విస్త‌ర‌ణ‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

Union Cabinet | తెలంగాణ రాష్ట్రంలో రెండు జాతీయ ర‌హ‌దారుల‌ విస్త‌ర‌ణ‌కు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది. రూ.7,597.16 కోట్ల అంచనా వ్యయంతో 190.76 కిలోమీటర్ల మేర రెండు జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నారు.

D

Telangana | Published On Jun 3, 2026, 4.28 pm IST

Union Cabinet | తెలంగాణ‌లో రెండు హైవేల విస్త‌ర‌ణ‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
Advertisement

4 లేన్లుగా ఆర్మూర్ - జగిత్యాల - మంచిర్యాల, జగిత్యాల-కరీంనగర్ రహదారులు
190.76 కిమీల ప్రాజెక్టుకు అనుమతి.
రోడ్ల విస్త‌ర‌ణ‌తో.. తీర‌నున్న ట్రాఫిక్ క‌ష్టాలు

Union Cabinet | తెలంగాణ రాష్ట్రంలో రెండు జాతీయ ర‌హ‌దారుల‌ విస్త‌ర‌ణ‌కు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది. ఎన్‌హెచ్ 63 ప‌రిధిలోని ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల హైవేని (Armoor–Jagtial–Mancherial section) హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ప‌ద్ధ‌తిలో విస్త‌రించ‌నుంది. అదేవిధంగా ఎన్‌హెచ్‌ 563 ప‌రిధిలోని జగిత్యాల-కరీంనగర్‌ జాతీయ రహదారిని (Jagtial–Karimnagar section) బీవోటీ పద్ధతిలో విస్తరించనున్నట్లు చెప్పింది.

రూ.7,597.16 కోట్ల అంచనా వ్యయంతో 190.76 కిలోమీటర్ల మేర రెండు జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైన త‌ర్వాత ఆర్మూర్‌-మంచిర్యాల మ‌ధ్య ప్ర‌యాణ స‌మ‌యం సుమారు గంట‌న్న‌ర త‌గ్గ‌నుంది. అటు జ‌గిత్యాల‌-క‌రీంన‌గ‌ర్ మ‌ధ్య ప్ర‌యాణ స‌మ‌యం కూడా సుమారు 45 నిమిషాలు త‌గ్గుతుంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు వ‌ల్ల ఇంధ‌న వినియోగం, కార్బ‌న్ ఉద్గారాలు, వాహ‌న నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు (VOC) గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

మ‌రోవైపు రూ. 8,300.79 కోట్ల అంచ‌నా వ్య‌యంతో త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రం నుంచి ఒడిశాలోని పారాదీప్ వ‌ర‌కూ మొత్తం 163.180 కిలోమీటర్ల పొడవుతో కొత్త తీరప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని త‌గ్గించి ప‌ర్యావ‌ర‌ణ హిత ర‌వాణాను ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో కీల‌క ప‌థ‌కానికి కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీ-NCR ప్రాంతంలో పాత ట్రక్కులు, బస్సుల భర్తీ కోసం NCRPBకి మద్దతు ఇచ్చే ప‌థ‌కానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మొత్తం రూ. 9,585 కోట్ల ఆర్థిక వ్యయంతో ఈ పథకాన్ని తీసుకువ‌చ్చింది. ఇందులో భాగంగా BS-IV లేదా అంతకంటే పాత ట్రక్కులు, బ‌స్సుల య‌జ‌మానుల‌ను.. వాటి స్థానంలో BS-VI లేదా అంతకంటే కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండే వాహనాలను లేదా ఈవీలు కొనుగోలు చేసేలా ప్రోత్స‌హించ‌డం ఈ ప‌థ‌కం ముఖ్య ఉద్దేశం.

Also Read..

ఏటీఎఫ్ ధ‌ర‌ల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. రూ.10 వేల కోట్ల‌తో నిధి

ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలా? కిషన్ రెడ్డివి అన్నీ యాక్షన్లే: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్

నిమిషాల్లోనే సినిమాను అంచ‌నా వేస్తున్నారు.. ప్రేక్ష‌కుల‌పై పూజాహెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!

Advertisement
Advertisement