Pooja Hegde | నిమిషాల్లోనే సినిమాను అంచనా వేస్తున్నారు.. ప్రేక్షకులపై పూజాహెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Pooja Hegde | స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే థియేట్రికల్ సినిమాల ప్రస్తుత పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు పరిశ్రమలోని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Entertainment | Published On Jun 3, 2026, 4.15 pm IST
Pooja Hegde | స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే థియేట్రికల్ సినిమాల ప్రస్తుత పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు పరిశ్రమలోని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూజా హెగ్డే మాట్లాడుతూ ప్రస్తుతం ప్రేక్షకులు గతంతో పోలిస్తే చాలా మారిపోయారని పేర్కొంది. సినిమా థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకుడు మొదటి కొన్ని నిమిషాల్లోనే ఆ సినిమా తనను ఆకట్టుకుంటుందా లేదా అనే విషయాన్ని అంచనా వేసేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. “ఇప్పుడు ప్రేక్షకులను తప్పుదారి పట్టించడం చాలా కష్టం. వారు ఏ సినిమా చూడాలో చాలా ఆలోచించి నిర్ణయించుకుంటున్నారు. స్టోరీ వారికి నచ్చుతుందా లేదా అన్నదాన్ని చాలా త్వరగా గుర్తిస్తున్నారు” అని ఆమె తెలిపింది. కమర్షియల్ సినిమాల విషయంలో నటీనటులపై ఒత్తిడి మరింత పెరిగిందని పూజా అభిప్రాయం వ్యక్తం చేసింది.
గ్లామర్, ఎమోషన్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు నటనలోనూ సమతుల్యం చూపాల్సిన అవసరం ఇప్పుడు తప్పనిసరైందని చెప్పింది. ఒక్క అంశంలో లోపం ఉన్నా ప్రేక్షకులు వెంటనే గుర్తించే స్థాయికి వచ్చారని వ్యాఖ్యానించింది. ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, షార్ట్ వీడియో యాప్స్, రీల్స్ వంటి కంటెంట్ పెరగడంతో థియేటర్ సినిమాలకు పోటీ మరింత తీవ్రమైందని పూజా తెలిపింది. ప్రతి వారం ప్రేక్షకుల వద్దకు అనేక రకాల వినోదం అందుబాటులోకి వస్తుండడంతో.. థియేట్రికల్ రిలీజ్ ఇప్పుడు మేకర్స్‌కు ఒక పెద్ద పరీక్షగా మారిందని ఆమె అభిప్రాయపడింది. అయితే, ఈ మార్పులన్నింటి మధ్య కూడా థియేటర్ ఫీలింగ్‌పై తనకు గట్టి నమ్మకం ఉందని స్పష్టం చేసింది. బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులతో కలిసి సినిమా చూడడం, నవ్వులు, చప్పట్లు, ఉత్సాహం ఇలా అన్నీ కలిసి వచ్చే అనుభూతి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో దొరకదని చెప్పింది. ఇదిలా ఉండగా.. ఇదిలా ఉండగా.. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నది. హిందీలో హై జవానీ ఇష్క్ హో నాహై నటించగా.. త్వరలోనే విడుదలకానుంది. తమిళంలో కాంచన-4, తెలుగులో దూల్కర్41 మూవీలో నటిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Peddi Review | పెద్ది రివ్యూ – రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది – జాన్వీ కపూర్ మైనస్!
జూన్ 4, 2026

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
జూన్ 3, 2026

Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!



